షాకింగ్ న్యూస్ - రద్దయిన నోట్లన్నీ ద‌క్షిణాఫ్రికా ఎన్నికల్లో     2017-11-07   22:18:24  IST  Raghu V

పెద్దనోట్ల రద్దు నేటికి సంవత్సరం అయ్యింది..అప్పటి ఘటనలు తలుచుకుంటే ఇప్పటికి ఎంతో భయం కలుగుతుంది.

ఎంతో మంది ఎన్నో కష్టాలు అనుభవించారు..మోడీ ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు చెలరేగాయి.ఒక్క సరిగా భారత్ మోడీ ప్రకటనతో ఉలిక్కి పడింది. డబ్బుకి అప్పటి వరకు విలువ ఇచ్చిన మనిషి..మొదటిసారిగా చీదరించుకున్న సమయం అది. నోట్ల రద్దు తో ఎన్నో పెళ్ళిళ్ళు రద్దు చేసుకున్నారు చాలా మంది..ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయిన సంఘటనలు నేటికి ఆ కుటుంబాలకి కళ్ళు ముందు కనపడుతున్నాయి. అలా ప్రజలని అతలాకుతలం చేసిన పెద్ద నోట్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలుసా ?

రద్దు కాబడిన నోట్లన్నీ ఇప్పుడు దక్షిణాఫ్రికా ఎన్నికల్లో ప్రత్యక్షం కానున్నాయి..షాక్ అయ్యారా ఇది నిజం రద్దు చేసిన పెద్ద నోట్లన్నీ ఇప్పుడు ద‌క్షిణాఫ్రికా వీదుల్లో ప్రత్యక్షం కానున్నాయి ..అయితే డబ్బు రూపంలో కాదు..అక్కడ 2019లో జ‌ర‌గ‌బోతున్న ఎన్నిక‌ల్లో … హార్డ్‌బోర్డులుగా అవును ఇది నిజమే..మనం బ్యాంక్ లో భద్రంగా దాచుకున్న డబ్బు ఇప్పుడు అక్కడ ఎన్నికల ప్రచారానికి వినియోగించ బోతున్నారు.

రద్దయిన పాతనోట్లు అన్నిటినీ రీసైకిల్ చేసి ద‌క్షిణాఫ్రికా ఎన్నికల ప్ర‌చారం కోసం ఉప‌యోగిస్తున్నారు..కేర‌ళ‌లోని క‌న్నూర్ ప్రాంతంలో ఉన్న వెస్ట్ర‌న్ ఇండియ‌న్ ప్లైవుడ్ లిమిటెడ్ ఈ విషయాన్ని వెల్లడించింది.. రిజ‌ర్వ్ బ్యాంకు నుంచి వచ్చిన ఈ రద్దయిన నోట్లన్నీ కలిపితే 800 ట‌న్నుల బరువు వచ్చిందని..ఇప్పుడు వాట‌న్నింటినీ హార్డ్‌బోర్డులుగా మార్చి ద‌క్షిణాఫ్రికా ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్నట్టుగా ఆ కంపెనీ కంపెనీ మార్కెటింగ్ అధికారి తెలిపారు.