అమెరికాలో 11వ తెలుగు సాహితీ సదస్సు..!!!

అమెరికాలోని ఒర్లాండ్ లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వరంలో 11వ తెలుగు సాహితీ సదస్సు నిర్వహించబడుతుంది.నవంబర్ 2 ,3 వ తేదీలలో ఈ వేడులకని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టుగా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

 Indians11th Telugusahitya Sadhassu In America-TeluguStop.com

కేవలం తెలుగు బాష , సాహిత్యానికి పెద్దపీట వేస్తూ రెండు రోజుల పాటు ఈ వేడుకల్ని నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ఎంతో మంది తెలుగు పండితులు, అష్టావధానులు విచ్చేస్తున్నారు.

అలాగే ప్రముఖ రచయితలు కూడా ఈ వేడుకల్లో పాలు పంచుకోనున్నారు.

నవంబర్ 2వ తేదీన 12 వ ఘంటశాల ఆరాధనోత్సవాలు జరుగనున్నాయి.

ఈ కార్యక్రమానికి కూడా పలువురు సంగీత గాయకులూ పాల్గొననున్నారు.ప్రేక్షకులని నచ్చిన సాహిత్య పరమైన అంశం మీద ప్రసంగించేలా విచ్చేసిన రచయితలని కవులని సంస్థ సభ్యులు కోరుతారు.

అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతీ ఒక్కరికి ప్రోశ్చహకాలు అందించబడుతాయి.అయితే

Telugu Telugusahitya, Telugu Nri Ups, Telugupeoples-

 

ఈ వేడుకల్లో పాల్గొనే వారికి ప్రవేశ రుసుము నిర్ణయించారు.ఫ్లోరిడా నుంచీ వచ్చే వారికి ఒక్కొక్కరికి 50 డాలర్లు.ఇతర రాష్ట్రాల నుంచీ వచ్చే వారికి ఉచితంగా నిర్ణయించారు.

ఈ రెండు రోజుల కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం 200 డాలర్లు విలువ చేసే తెలుగు పుస్తకాలు అందిస్తారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా సంగీత విభావరి అలరించనుందని ఆహ్వనితులు తెలిపారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube