మోసాలు, జీతాలు చెల్లించకపోవడం: విదేశాల్లోని భారతీయుల ఫిర్యాదులు 13వేలకు పైనే...

ఉపాధి కోసం, నాలుగు రాళ్లు సంపాదించేందుకు విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలో వేతనాలు చెల్లించపోవడం, మోసం తదితర కారణాలపై విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల నుంచి సుమారు 13 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.

 Indians Working Abroad Mea-TeluguStop.com

మురళీధరన్ పార్లమెంట్‌కు తెలిపారు.

మొత్తం 102 దేశాల్లో ఒక్క సౌదీ అరేబియా నుంచే అత్యధికంగా 3,844 ఫిర్యాదులు అందినట్లు ఆయన వెల్లడించారు.

విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2019లో అక్టోబర్ 31 నాటికి 13,665 ఫిర్యాదులు, 2018లో 17,379 ఫిర్యాదులు భారత ప్రభుత్వానికి అందాయి.

Telugu Indians, Telugu Nri Ups-

భారతీయుల నుంచి ఫిర్యాదులను అందుకున్న వెంటనే ఆయా దేశాల్లో ఉన్న భారత హైకమీషన్లు స్థానిక ప్రభుత్వ అధికారులతో సమావేశమై సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తున్నాయని మురళీధరన్ పేర్కొన్నారు.ఇదే సమయంలో ఉపాధి సంబంధిత ఫిర్యాదులపైనా వేగంగా స్పందించి విదేశీ యాజమానులతో నేరుగా చర్చలు జరుపుతున్నాయని ఆయన తెలిపారు.మరోవైపు కువైట్‌లో కార్మికుల సేవలను ఉపయోగించుకునేందుకు మొబైల్ యాప్‌లను ఉపయోగిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించిన మురళీధరన్… అటువంటి వాటి బారిన భారతీయులు పడలేదని వెల్లడించారు.

ఆ దేశ చట్టాలు మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకమని.కువైట్ ప్రభుత్వం కూడా మీడియా కథనాలపై స్పందించిందని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube