దుబాయ్‌లో జాక్‌పాట్ కొట్టిన ఇద్దరు భారతీయులు  

Indians Win Million Dollars Each In -dubai Based,each In ,indians,jayagupta,win Million Dollars,బెంజ్ కారు,భారతీయుల

దుబాయ్‌లో ఇద్దరు భారతీయులకు జాక్‌పాట్ తగిలింది. ఒక మిలియన్ చొప్పున ఇద్దరికి లాటరీ తగలగా మరోకరికి బెంజ్ కారు బహుమతిగా లభించింది. వీరిలో ఒకరు జయగుప్తా, మరోకరు బచానీ వీరిద్దరు అక్కడ వ్యాపారవేత్తలు కావడం గమనార్హం..

దుబాయ్‌లో జాక్‌పాట్ కొట్టిన ఇద్దరు భారతీయులు-Indians Win Million Dollars Each In Lottery

జయా గుప్తా గత 37 ఏళ్లుగా దుబాయ్ కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు తల్లిని చూడటానికి లేదంటే వ్యాపార నిమిత్తం ముంబై వెళ్లేవారు. ఈ క్రమంలో గత 15 ఏళ్ల నుంచి ఆమె ‘‘దుబాయ్ డ్యూటీ ఫీ సంస్థ’’ నుంచి లాటరీ టికెట్లు కొంటూ వస్తున్నారు.

అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో కొద్దిరోజుల క్రితం ఆమె ముంబై పయనమయ్యారు. జయ ప్రయాణం రోజున మరోసారి లాటరీ టిక్కెట్లు అమ్మే అమ్మాయిలు రావడం వారు టికెట్ కొనుగోలు చేయాలని కోరడం జరిగింది. అయితే ప్రతిసారి లాటరీ కొనడం డ్రాలో నిరాశ చెందడం ఆనవాయితీగా మారిందని తన చేత్తో కొంటే అదృష్టదేవత కనికరించకపోవడంతో ఒకసారి సేల్స్ గర్ల్స్ చేతే టిక్కెట్ తీయిస్తే లక్ ఎలా ఉంటుందోనని ట్రై చేశారు.

జయ భావించినట్లుగానే ఈసారి ఆమె ఫేట్ మారింది ఈ నెల 9 జరిగిన బంపర్ డ్రాలో జయా గుప్తా కొనుగోలు చేసిన సీరిస్ 303లోని 0993 నంబర్ గల టిక్కెట్‌కు ఒక మిలియన్ లాటరీ తగిలింది. .

ఈ సందర్భంగా జయా గుప్తా మాట్లాడుతూ తనకు లాటరీ తగిలిందంటే నమ్మ లేకపోతున్నానని ఇంత భారీ మొత్తంతో ఏం చేయాలో కూడా తనకు తట్టడం లేదన్నారు. అయితే తాను కొందరి వద్ద అప్పులు చేశానని ముందు వాటిని తీర్చేసి, కొంత మొత్తాన్ని వ్యాపారంలో పెట్టుబడులు పెడతానని మరి కొంత మొత్తాన్ని ఛారిటీ సంస్థకు విరాళంగా ఇస్తానని ఆమె స్పష్టం చేశారు. ఓర్పు వహిస్తే ఎప్పటికైనా అదృష్టం తలుపు తడుతుందనే మాట తన విషయంలో నిజమైందని జయ ఉద్వేగంగా చెప్పారు. ఇక మరో విజేత బచానీ దుబాయ్‌లోనే వస్త్ర వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.

లాటరీలో గెలుపొందడం తనను థ్రిల్‌కు గురిచేసిందని తన ఆనందాన్ని పంచుకున్నారు. తాను ఇప్పుడు మిలియనీర్‌ అయ్యానని తనకు ఇంతటి అదృష్టాన్ని కలిగించిన దుబాయ్ డ్యూటీ ఫీ సంస్థకు బచానీ కృతజ్ఞతలు తెలిపారు.