అమెరికాలో పెరుగుతున్న భారతీయుల వలసలు..

ట్రంప్ వలస విధానం వలన ఎంతో మంది వివిధ దేశాల నుంచీ వలసలు వచ్చిన వారిని నిర్భందించిన విషయం అందరికీ తెలిసిందే.ఎంతో మంది వలస జీవులు నిర్భందం వలన వారి వారి పిల్లలకి దూరంగా ఉండటం ఎన్నో కష్టాలని అనుభవించడం అందరికీ విధితమే అయితే ఈ క్రమంలోనే భారతీయుల వలసలపై ఒక కధనం వెల్లడించింది టైమ్స్.

 Indians Nris Migration In America-TeluguStop.com

ఆ వివరాలలోకి వెళ్తే.

వివిధ దేశాల నుంచీ అమెరికాలోకి ప్రవేసించే వారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నారని లాస్ ఏంజిల్స్ టైమ్స్ వెల్లడించింది.దాదాపు ఈ వలసలు అన్నీ మెక్సికో నుంచీ అమెరికాలో కి ప్రవేసిస్తున్నవేనని తేలింది.మొత్తం మీద నిర్బంధంలోకి తీసుకున్న వారిలో భారతీయుల శాతం తక్కువే అయితే ఈ మధ్య కాలంలో వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఈ కధనంలో పేర్కొంది.

కాలిఫోర్నియాలోని విక్టర్‌విల్లే ఫెడరల్‌ కారాగారంలో ఆగస్టులో ఉన్న 680 మంది వలసదారుల్లో దాదాపు 380 మంది భారతజాతీయులేనని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ప్రిజన్స్‌ను ఉటంకిస్తూ పేర్కొంది.

ఇదిలాఉంటే ఇమ్మిగ్రేషన్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నందున నేరగాళ్ల హోదాలో కాకుండా పౌర నిర్బంధం కిందే ఉంచినట్లు తెలిపింది…ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చెందిన ఇంపీరియల్‌ వ్యాలీ ఆవరణలో ఉన్న వారిలో 40శాతం, అడెలాంటో ప్రాసెసింగ్‌ కేంద్రంలో నిర్బంధంలో ఉన్న వారిలో 20శాతం మంది భారతీయులేనని పేర్కొంది.2018లో ఇప్పటివరకు సరిహద్దు సిబ్బంది అరెస్టు చేసిన వారిలో 4,197 మంది భారత జాతీయులనేని ఒక రిపోర్ట్ ఆధారంగా తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube