అబుదాబి లో ఉండే భారతీయులు జర జాగ్రత్త....ఈ రూల్స్ బ్రేక్ చేస్తే లక్షల్లో జరిమానా...

Indians Living In Abu Dhabi Should Be Careful Breaking These Rules Will Result In A Fine Of Lakhs

వలస వాసులు ఏ దేశం వెళ్ళిన సరే తప్పకుండా తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏమిటంటే.ఆయా దేశాల పద్ధతు, సంస్కృతులు, వారు గౌరవించుకునే దేవతలు, ముఖ్యంగా అక్కడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.

 Indians Living In Abu Dhabi Should Be Careful Breaking These Rules Will Result In A Fine Of Lakhs-TeluguStop.com

వీటి విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించిన జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది.మన భారత దేశం ఇచ్చినంత స్వేఛ్చ అన్ని దేశాలు ఇస్తాయనుకుంటే పొరబాటే.

మన దృష్టిలో చిన్న తప్పులే కదా అనుకున్నవే కొన్ని దేశాలలో పెద్ద పెద్ద తప్పులుగా భావించి పెద్ద శిక్షలు, భారీ జరిమానాలు విధించబడుతాయి.ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే… అబుదాబి ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ విషయంలో తీసుకున్న నిర్ణయమే అందుకు కారణం.

 Indians Living In Abu Dhabi Should Be Careful Breaking These Rules Will Result In A Fine Of Lakhs-అబుదాబి లో ఉండే భారతీయులు జర జాగ్రత్త….ఈ రూల్స్ బ్రేక్ చేస్తే లక్షల్లో జరిమానా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యూఏఈ రాజధాని అయిన అబుదాబి ప్రభుత్వం అక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కటినమైన చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.చిన్న చిన్న తప్పిదాలు వలన ప్రతీ ఏటా వందలాది మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మృతి చెందుతున్నారని అందుకే కటినమైన చర్యలు ఇకపై చేపట్టనున్నట్టుగా ప్రకటించింది ప్రభుత్వం.

మరీ ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ విషయంలో వాహనదారులు ఎంతో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని తెలిపారు.ఇకపై రెడ్ సిగ్నల్ క్రాస్ చేసిన ఎవరికైనా సరే భారీ జరిమానాలు విధించనున్నట్టుగా తెలుస్తోంది.

వాహనదారులు ఎవరైనా సరే రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే 51 వేల దిర్హమ్స్ అంటే భారత కరెన్సీలో రూ.16.50 లక్షల జరిమానా విధించనున్నారట.ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికె అధికారులకు ఆదేశాలు జారీ చేసిందట.

కేవలం ఫైన్ తో మాత్రమే సరిపెట్టడం లేదు వాహనాన్ని నెలరోజుల పాటు జప్తు చేసి అతడి ఖాతాలో బ్లాక్ పాయింట్స్ కుడా చేర్చుతారట.ఇక అతడి లైసెన్స్ కుడా రద్దు చేస్తారని అధికారులు తెలిపారు.

అంతేకాదు వాహనాలు నడిపే క్రమంలో ఫోన్ లో మాట్లాడటం తీవ్ర నేరంగా పరిగణించబడుతుందట.ప్రతీ ఏటా కేవలం ఫోన్ చూస్తూ వాహనాలు నడపడం కారణంగానే రోడ్డు ప్రమాదాల రేటు పెరుగుతోందని ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికే కటినమైన నిభందనలు అమలు చేస్తున్నామని అంటున్నారు అధికారులు.

#Indians #IndiansAbu #Abu Dhabi #Rules #Signal

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube