భారత్ లో జరుగుతున్న రైతు ఉద్యమానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచీ మద్దతు లభిస్తోంది.ముఖ్యంగా అమెరికా లో అయితే ఏకంగా భారత్ లో రైతు ఉద్యమానికి మద్దతు ఇస్తూ అక్కడి అసెంబ్లీ లో తీర్మానాలు కూడా చేసుకునే స్థాయికి భారత రైతు ఉద్యమం వెళ్ళింది.
ఏ దేశం ఎలా స్పందించినా, రైతులకు విదేశీయులు మద్దతు ఇచ్చినా భారత ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ ఈ విషయంలో స్పందించిన ధఖాలా లేదు, పైగా ఇది మా అంతర్గత వ్యవహారం ఎవరూ కల్పించుకోవద్దని ముఖం మీద చెప్పేసింది కూడా.ఈ పరిస్థితుల నేపధ్యంలోనే
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు, ఎన్నారై సంఘాలు ఓ వినూత్న ఆలోచన చేశాయి.
రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలవాలని నిర్ణయం తీసుకున్నాయి.ప్రేమికుల దినోత్సవాన్ని రైతుల ఉద్యమానికి ముడిపెట్టి రైతులపై తమకు ఉన్న ప్రేమను అలాగే రైతుల ఉద్యమానికి తమ మద్దతును ప్రకటించాయి.
ఇంతకీ వారు తలపెట్టిన వినూత్న ఆలోచన ఏంటంటే.ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ, వివిధ దేశాల్లో ఉండే రాయబార కార్యాలయాలకు, అక్కడి సిబ్బందికు రోజా పువ్వులు ఇస్తూ సంఘీభావం తెలుపుతున్నారు.
రైతుల ఉద్యమానికి ఇది మా వినూత్న మద్దతని ప్రకటించారు.భారత్ లో రైతుల ఉద్యమాలను గుర్తించి రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.గ్లోబల్ ఇండియా ప్రోగ్రసివ్ డయాస్పారో అనే స్వచ్చంద సంస్థ ట్వీట్ or సెండ్ రోజ్ అనే సామాజిక ఉద్యమానికి పిలుపునిచ్చింది.దాంతో ప్రపంచ వ్యాప్తంగా రైతులకు మద్దతు ఇస్తున్న ప్రవాసీయులు, ప్రవాస సంఘాలు హాష్ ట్యాగ్ రోజ్ టు రిపీల్ , హాష్ ట్యాగ్ లవ్ టు ఫార్మర్స్ లు ఇస్తూ ట్విట్టర్ ద్వారా తమ నిరసన ప్రధానికి తెలిసేలా చేస్తున్నాయి.
భవిష్యత్తులో కూడా ఇలాంటి నిరసనలు చేపడుతామని పలు సంఘాలు ప్రకటించాయి.