న్యూయార్క్ లో భారతీయుల భారీ ప్రదర్సన పాక్ కి వ్యతిరేకంగా ర్యాలీ  

  • భారత జవాన్ల పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఘోరంగా 49 మంది జవాన్లు అసువులు బాసిన విషయం అందరికి తెలిసిందే. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించింది. ప్రపంచ దేశాలలో ఉంటున్న ఎంతో మంది భారతీయులు తమ నిరసనలని తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే న్యూయార్క్ లో ఉంటున్న భారతీయులలో దాదాపు నాలుగు వందల మంది వీధుల్లోకి వచ్చి పాక్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు.

  • పాకిస్థాన్ ఎంబసీ ముందుకు ర్యాలీగా చేరుకొని పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారుఈ రకమైన నిరసనలు జరగడం న్యూయార్క్ లో ఇదే ప్రధమమని, ఇంతమంది భారతీయులు భారీ ప్రదర్శనగా రావడం ఎన్నడూ జరగలేదని అంటున్నారు పోలీసు ఉన్నత అధికారులు.

  • Indians In US Protest Pakistan's Terror Links-Pakistan Links Pulwama Attacks

    Indians In US Protest Pakistan's Terror Links

  • సైనికులపై జరిగిన దాడి వెనుక తప్పకుండా పాక్ హస్తం ఉందని వారు ఆరోపణలు చేశారు. ఒక్క న్యూయార్క్ లో మాత్రమే కాకుండా చికాగోలో సిఅతం భారతీయులు పాక్ ఎంబసీ కార్యాలయం ముందు నిరసనలు చేపట్టారు. పాక్‌కు సరైన బుద్ధి చెప్పాలంటే తప్పకుండ భారత్ కి ప్రపంచ దేశాలు సహకరించాలని నినాదాలు చేశారు.