ఇంగ్లాండ్‌లో బ్రిటన్‌ల కంటే భారతీయులకే మెరుగైన విద్య, సొంత ఇళ్లు..

యూకేలో( UK ) విడుదలైన 2021 సెన్సస్ డేటా ప్రకారం, ఇంగ్లాండ్‌లో బ్రిటన్‌ల కంటే భారత జాతికి( Indians ) చెందిన ప్రజలే అత్యధిక విద్యావంతులుగా ఉన్నారు.అంతే కాదు అధిక మంది ఎన్నారైలు ( NRI ) సొంత గృహాలను కలిగి ఉన్నారు.

 Indians In Uk Have Highest Level Of Education Home Ownership Details, Uk Census,-TeluguStop.com

ఇతర జాతి సమూహాలతో పోలిస్తే భారతీయులు, చైనీయులు అత్యధిక స్థాయి విద్యను కలిగి ఉన్నారు.వారిలో అత్యధిక సంఖ్యలో నిపుణులను కలిగి ఉన్నారు.

యూకేలోని భారతీయుల జనాభాలో 52% అత్యధిక స్థాయి విద్యను కలిగి ఉన్నారు.ఇండియన్‌ పీపుల్ 56%తో చైనీయుల తర్వాత రెండవ స్థానంలో ఉన్నారు.

ఇంటి యాజమాన్యం విషయానికి వస్తే, బ్రిటీష్వారిలో 68% మందితో పోలిస్తే 71% మంది భారతీయులు సొంత ఇళ్లను కలిగి ఉన్నారు.

ఇక ఉపాధి పరంగా చూసుకుంటే భారత, చైనీయులు వైద్యులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులతో సహా వృత్తిపరమైన ఉద్యోగాలలో 34% వాటాను కలిగి ఉన్నారు.ఈ ఉద్యోగాలలో శ్వేత ఐరిష్ 33%, అరబ్బులు 30%, పాకిస్థానీయులు 20%, బంగ్లాదేశ్ 17%, వైట్ బ్రిటిష్ వారు 19% ఉన్నారు.స్వతంత్ర కాంట్రాక్టర్ల కేటగిరీలో, 10% భారతీయులు, 11% తెల్ల బ్రిటీష్ ప్రజలు ఉన్నట్లు నివేదికగా వెల్లడించింది.

ఆరోగ్యం విషయానికి వస్తే, సాధారణ జనాభాలో 48% మంది చాలా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారని నివేదించగా, 1.2% మంది చాలా చెడ్డ ఆరోగ్యాన్ని కలిగి ఉన్నట్లు నివేదించారు.వైట్ ఐరిష్, వైట్ జిప్సీలు అత్యంత పేలవమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.ఇంగ్లాండ్‌, వేల్స్ అంతటా విద్య, ఉపాధి, ఆరోగ్యం, గృహనిర్మాణంలో జాతి సమూహాల మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందని నివేదిక సూచిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube