అమెరికాకు దూరమవుతున్న భారతీయులు: కెనడాకు క్యూ , కారణం ఇదే..!!

సాధారణంగా విదేశాల్లో స్థిరపడాలనే భారతీయుల ఫస్ట్ ఛాయిస్ అమెరికానే.అయితే యూఎస్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్బంధ ఇమ్మిగ్రేషన్ విధానాలతో పాటు గ్రీన్‌కార్డులు పొందడంలో ఇబ్బంది కారణంగా భారతీయుల చూపు కెనడాపై పడింది.

 Indians Immigrating To Canada At An Astonishing Rate-TeluguStop.com

కెనడా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను సడలించడంతో పాటు విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండటంతో 2016 నుంచి కెనడాకు వలస వచ్చే భారతీయుల సంఖ్య పెరుగుతోంది.

కెనడాలో శాశ్వత నివాసులుగా మారిన భారతీయు సంఖ్య 2016లో 39,340 ఉండగా.2019లో ఇది 80,685కు చేరింది.2019 మొదటి 11 నెలల నాటికి ఇది 105 శాతం కంటే ఎక్కువ పెరిగిందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్‌ఏపీ) ఇమ్మిగ్రేషన్ విశ్లేషణలో తేలింది.అమెరికాలో హెచ్1 బీ వీసాలను పొందడం, వాటి పునరుద్ధరణ, శాశ్త నివాసానికి అడ్డంకులు వంటి సవాళ్ల కారణంగా భారతీయ యువ టెక్కీలు కెనడా బాట పడుతున్నారు.

Telugu Canada, Indians Canada, Telugu Nri-

ఉపాధి-ఆధారిత వలస వీసాలు, గ్రీన్‌కార్డుల జారీలో పరిమితులు విధిస్తున్న కారణంగా భారత సంతతికి చెందిన ప్రొఫెషనల్స్ యూఎస్‌లో శాశ్వత నివాసం పొందటానికి దశాబ్ధాల పాటు వేచి చూడాల్సి ఉంటుంది.ఈ క్రమంలో యూఎస్, భారతీయ టెక్ కంపెనీలు కెనడాలో అనుబంధ కార్యాలయాలను తెరిచాయి.ఇందుకు తగ్గట్టుగానే కెనడా ప్రభుత్వం సైతం టెక్ వర్కర్ల కోసం తన వర్క్ పర్మిట్ విధానాన్ని క్రమబద్ధీకరించింది.

Telugu Canada, Indians Canada, Telugu Nri-

అంతేకాకుండా భారత జాతీయులు కెనడా పాయింట్స్ బేస్డ్ సెలక్షన్ సిస్టమ్‌కి సరిగ్గా సరిపోతారు.దీనితో పాటు కెనడా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పాయింట్స్ సిస్టమ్‌లో శాశ్వత నివాసం కోసం అర్హత సాధించడానికి ఉన్నత స్థాయి ఆంగ్ల భాషా నైపుణ్యాలు అవసరం.ఒకవేళ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ ద్వారా తగినంత పాయింట్లు సంపాదించని పక్షంలో కెనడియన్ ప్రావిన్స్‌లు నిర్వహిస్తున్న ప్రోగ్రామ్‌ల కింద శాశ్వత నివాసం పొందవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube