ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కేసు: ఆరుగురు తెలుగువారికి జైలు శిక్ష

ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో సంచనలం సృష్టించిన యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ కుంభకోణం వ్యవహారంలో ఆరుగురు భారతీయులకు ఫెడరల్ కోర్టు జైలు శిక్ష విధించింది.

 Indians Held Inus Sentencedtojail-TeluguStop.com

విదేశీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన అంతర్జాతీయ విద్యార్థి వీసా పథకం దుర్వినియోగం అవుతోందని గుర్తించిన అమెరికా హోంలాండ్‌ సెక్యూరిటీ విభాగానికి చెందిన ‘ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ)’ అధికారులు.

‘పేపర్‌ చేజ్‌’ పేరుతో ఒక రహస్య ఆపరేషన్‌ ప్రారంభించారు.దీనిలో భాగంగా మిచిగన్‌ రాష్ట్రంలోని ఫార్మింగ్టన్‌లో 2015లో నకిలీ యూనివర్సిటీని స్థాపించారు.

దీనికి ‘‘యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్’’ అని పేరు పెట్టారు.కేవలం కాగితాలకే పరిమితమైన ఈ విశ్వవిద్యాలయంలో ఎలాంటి సిబ్బందీ, అధ్యాపకులు, తరగతులు ఉండవు.

Telugu Telugu Nri Ups, Telugu America-

ఈ వర్సిటీని ఉపయోగించుకుని అమెరికాలో అక్రమంగా నివసించాలనుకునేవారిని.విద్యార్ధులుగా చేర్చుకుని ఇమ్మిగ్రేషన్ కుంభకోణాలకు పాల్పడేవారిని పట్టుకోవడమే ఈ ఆపరేషన్ లక్ష్యం.అలా సదరు వర్సిటిలో విద్యార్ధులను అక్రమంగా చేరుస్తున్న ఎనిమిది మంది దళారులను హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అరెస్ట్ చేయడంతో పెద్ద దుమారం రేగింది.దళారులంతా తెలుగువారు కావడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం కలకలం చెలరేగింది.

సుధీర్ఘ విచారణ అనంతరం ఎనిమిది మందిలో ఆరుగురికి ఫెడరల్ కోర్టు జైలు శిక్ష విధించగా.మరో ఇద్దరికి త్వరలో శిక్ష ఖరారుకానుంది.

శిక్షపడిన తెలుగువారు:


సామ సంతోష్ – 24 నెలలు
భరత్ కాకిరెడ్డి – 18 నెలలు
సురేశ్ కందాల – 18 నెలలు
అవినాశ్ తక్కిళ్లపల్లి – 15 నెలలు
అశ్వంత్ నూనె – 12 నెలలు
నవీన్ ప్రత్తిపాటి – 12 నెలలు

మిగిలిన మరో ఇద్దరు నిందితులు రంపీస ప్రేమ్‌కు నవంబర్ 19న, కర్నాటి ఫణిదీప్‌కు వచ్చే ఏడాది జనవరిలో శిక్షలు ఖరారు కానున్నాయి.కాగా.

ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కేసులో 145 మంది విద్యార్ధులను అమెరికా ప్రభుత్వం వారి స్వదేశాలకు తిప్పి పంపిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube