అమెరికాలో ఈ బిల్లు కోసం భారతీయుల పట్టు..!!!

అమెరికాలో ఉంటున్న లక్షల మంది భారతీయులకి న్యాయం జరగాలంటే ఎస్.386 బిల్లు ని ఆమోదించాలని భారతీయులు అందరూ పట్టు బడుతున్నారు.ఈ మేరకు అన్ని భారతీయ సంఘాలు కలిసి అమెరికాలో కార్యాచరణ రూపొందించడానికి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది హాజరయ్యారు.అంతేకాదు అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు అన్నీ ఈ సమావేశానికి హాజరయ్యాయి.

 Indians Fightfor S386 Bill-TeluguStop.com

Telugu Indians, Natas, Nats, Telugu Nri Ups-

 ఎస్.386 ఈ బిల్లు వలన గ్రీన్ కార్డ్ కోటలో వలస వాసుల కి జారీచేసే 7 శాతాన్ని 15 శాతానికి పెంచుతారు.దాంతో అమెరికాలో ఉంటున్న సుమారు 6 లక్షల మంది భారతీయులకి భారీ లబ్ది చేకూరుతుంది.అయితే ఈ బిల్లుకి ఇంకా ఆమోద ముద్ర పడలేదు.ఇదిలాఉంటే ఈ బిలుని ఆమోదించాలని భారతీయ సంఘాలు అన్నీ ఏకం అయ్యాయి.

Telugu Indians, Natas, Nats, Telugu Nri Ups-

 అమెరికాలోని చికాగోలో ఉన్న షిరిడీ సాయి మందిరంలో సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ రూపొందించుకున్నాయి.నైపుణ్యం కలిగిన వలస దారుల కుటుంభాలకి ఎదురవుతున్న ఇబ్బందులు చర్చించారు.భారతీయ సంఘాలైన తానా గుజరాతీ బెంగాలి, కేరళా మొదలగు అసోసియేషన్ లు అన్నీ ఈ సమావేశంలో పాల్గొని మద్దతు తెలిపాయి.ఈ బిల్లుకి మద్దతు దొరికేలా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామని ఈ సభలో నిర్వహణ కీలక సభ్యులు తెలిపారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube