మెల్బోర్న్ లో ఘోరం..ముగ్గురు ఎన్నారైలు దుర్మరణం..!!!  

ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్త వారి కుమారుడు చనిపోవడంతో పాటు, వారి భందువులు కూడా చనిపోవడం వారి కుటుంబాన్ని షాక్ కి గురి చేసింది.

TeluguStop.com - Indians Died In Melbourne

ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియాలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి.ఈ ప్రమాద ఘటన వివరాల్లోకి వెళితే.

పంజాబ్ లోని పటియాల జిల్లా సమాన ప్రాంతానికి చెందిన ముగ్గురు పంజాబీలు మెల్బోర్న్ లో స్థిరపడ్డారు.స్వర్ణ జీత్ సింగ్ మెల్బోర్న్ ట్రక్ డ్రైవర్ గా పని చేస్తూ తన భార్య అమన్ దీప్ కౌర్, కుమారుడు సేహాజ్ తో కలిసి ఉంటున్నారు.కుమారుడికి సెలవులు కావడంతో స్వర్ణ జిత్ సింగ్ తన కుటుంబంతో పాటు తమ భందువు అయిన గుర్మీత్ కౌర్, ఆమె కుమారుడు ఇష్ప్రీత్ సింగ్ తో కలిసి మెల్బోర్న్ లోని హిల్ స్టేషన్ కి విహార యాత్రకు వెళ్లారు…

TeluguStop.com - మెల్బోర్న్ లో ఘోరం..ముగ్గురు ఎన్నారైలు దుర్మరణం..-Telugu NRI-Telugu Tollywood Photo Image

అక్కడ అ కొంత సమయం గడిపిన తరువాత ఇంటికి వస్తున్న క్రమంలో వారి వాహనంపై పై ఒక చెట్టు విరిగిపడటంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.ఇదే సమయంలో వారితో పాటే ఉన్న వారి బంధువు గుర్మీత్ కౌర్, సేహాజ్ లకి తీవ్ర గాయాలు కావడంతో వీరిని ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నారు.

#IndiansDied #Punjabis #Accident #Truck Driver

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు