అక్రమంగా ప్రవేశించి...అడ్డంగా బుక్కయిన భారతీయులు..!!!  

Indians Arrested For Illegally Entering To Us Indians Arrested For Illegally Entering To Us - Telugu Border, Illegal Entry, Indians Arrested For Illegally Entering To Us, Nri News, Us

అమెరికాలోకి అక్రమ వలసలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా సరిహద్దు వద్ద రక్షణ గోడలను నిర్మించిన విషయం విధితమే.తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే సహించేది లేదని తేల్చి ఆయన ఎన్నో సార్లు హెచ్చరికలు జారీచేశారు కూడా.

 Indians Arrested For Illegally Entering To Us Indians Arrested For Illegally Entering To Us

అయితే ట్రంప్ అక్రమ వలసదారులను అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవుతూనే ఉన్నాయి.దాంతో సరిహద్దు వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు…ఈ క్రమంలోనే…
చట్టవిరుద్ధంగా అక్రమ మార్గంలో అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన నలుగురు భారతీయులను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళితే.అమెరికా దేశ సరిహద్దు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు రెండు వాహనాలు అనుమానాస్పదంగా కనిపించడంతో సోదాలు నిర్వహించారు.

అక్రమంగా ప్రవేశించి…అడ్డంగా బుక్కయిన భారతీయులు..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఈ తనిఖీలలో లో ఒక వాహనంలో నలుగురు వ్యక్తులు ,మరొక వాహనంలో ఇద్దరు వ్యక్తులతో పాటు వారికి సంబంధించిన వస్తువులు ఉండటం గమనించారు.

పట్టుబడిన ఈ ఆరుగురిలో నలుగురు వ్యక్తులు భారతీయులు కాగా మరో ఇద్దరు వ్యక్తులు అమెరికాకు చెందిన వారిని తెలుస్తోంది.వీరి వద్ద ఎలాంటి ధ్రువ పత్రాలు లేకపోవడంతో చట్టవిరుద్ధంగా అమెరికా లోకి ప్రవేశించనున్న కారణంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.ఇదిలాఉంటే విచారణలో గనుకా నేరం రుజువైతే సుమారు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు