లండన్ చెక్కేస్తున్న భారతీయ విద్యార్ధులు..!!!

ప్రస్తుతం భారత్ లోని విద్యార్ధులు టెక్నాలజీకి తగ్గట్టుగా చదువులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్లి చదువుకోవడానికే ఇష్టపడుతున్నారు.ప్రతిభ ఉంటే చాలు ఏ దేశమైనా సరే తడాకా చూపిస్తాం అంటూ దూసుకుపోతున్నారు.

 Indians Are Going To Uk-TeluguStop.com

ముఖ్యంగా భారతీయ విద్యార్ధులు చదువుల నిమ్మిత్తం అమెరికా వంటి దేశాలకి పరుగులు పెట్టె వాళ్ళు.కానీ అమెరికా వీసా నిభందనలతో మరో దేశంవైపు భారతీయ విద్యార్ధులు దృష్టి సారించారు.

దాంతో బ్రిటన్ రాజధానికి వచ్చి చదువుకునే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.గతంలో బ్రిటన్ లో చదువుకునే భారతీయుల సంఖ్య దాదాపు అందరికంటే కూడా మూడవ స్థానంలో ఉండేవారు.

కానీ ఆ మధ్య కాలంలో అమెరికాకి అత్యధికంగా వలసలు వెళ్ళడంతో భారత్ తన 3 వ స్థానాన్ని కోల్పోయింది.అయితే తాజాగా మళ్ళీ భారతీయ విద్యార్ధులు బ్రిటన్ బాట పట్టడంతో మళ్ళీ భారత్ మూడో స్థానానికి చేరుకుంది.

బ్రిటన్ విద్యా శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం చూస్తే.2018 -19 లో భారతీయ విద్యార్ధుల సంఖ్య 34.7 శాతం పెరిగిందని తెలిపింది.అయితే 25,650 మందితో చైనా మొదటి స్థానంలో ఉందని 7460మంది విద్యార్ధులతో అమెరికా రెండవ స్థానంలో ఉందని భారత్ 7160 మంది విధ్యార్ధులతో మూడవ స్థానానికి చేరుకుందని, మరింత మంది భారతీయ విద్యార్ధులు రానున్న నేపధ్యంలో భారత్ రెండవ స్థానానికి త్వరలోనే చేరుకుంటుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube