ఆ విషయంలో భారతీయులే టాప్ లో ఉన్నారట..!

ఈ ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగించనిదే క్షణం కూడా గడవదు.అంతలా చిన్నా పెద్ద స్మార్ట్ మొబైల్ కి అలవాటు పడిపోయారు.

 Indians Are At The Top In That Regard Mobile Phones, Mobile Using, India, Top-TeluguStop.com

తిండి లేకుండా అన్నా ఉంటారేమో గాని స్మార్ట్ ఫోన్ లేనిదే అసలు ఉండలేకపోతున్నారు.మన భారత్‌ లో సగటున ఒక్కో యూజర్‌ 4.48 గంటలు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారట తెలుసా స్మార్ట్‌ఫోన్‌ వినియోగం గతేడాదితో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగింది.మొబైల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ ఇండియా ట్రాఫిక్‌ ఇండెక్స్‌ 2021 ప్రకారం మొబైల్‌లో సగటు 3జీ/4జీ డేటా వినియోగం నెలకు 2015లో 0.8 జీబీ నమోదైంది.ఇది అయిదేళ్లలో 17 రెట్లు అధికమైనది అన్నమాట 2020లో 13.5 జీబీకి పెరిగింది.అయితే ఈ డేటాలో 54 శాతం డేటా యూట్యూబ్, సోషల్‌ మీడియా, ఓటీటీ వీడియోలకు, 46 శాతం డేటా ఫిట్‌నెస్, ఫిన్‌టెక్, ఎడ్యుటెక్, ఈటైలింగ్‌కు వినియోగం అవుతోంది.5జీ సేవల ప్రారంభానికి ఈ డేటా గణాంకాలు పునాదిగా ఉంటాయని నోకియా తన నివేదికలో వెల్లడించింది.5జీ అందుబాటులోకి వస్తే డేటా గరిష్ట వేగం 1 జీబీకి చేరుతుందని అంచనా వేస్తోంది.

Telugu India, Top Place-Latest News - Telugu

అలాగే మొబైల్‌ డేటాలో మన దేశం రెండవ స్థానంలో ఉంది.మొదటి స్థానంలో ఫిన్‌లాండ్‌ దేశం ఉంది అయిదేళ్లలో 63 రెట్ల డేటా వృద్ధి జరిగింది.ఈ స్థాయి వినియోగంతో ఏ దేశమూ భారత్‌ తో పోటీపడలేదని నోకియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అమిత్‌ మార్వా తెలిపారు.10 కోట్ల మంది 4జీ మొబైల్స్‌ ఉన్న కస్టమర్లు ఇప్పటికీ 2జీ లేదా 3జీ సేవలను మాత్రమే వినియోగిస్తున్నారు.ఇంకో విషయం ఏంటంటే ఎక్కువగా షార్ట్‌ వీడియోలను చూడడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారట.

ప్రతి నెల సగటున 18 కోట్ల మంది షార్ట్ వీడియోలను వీక్షిస్తున్నారు.

ఒక నెలలో 110 బిలియన్‌ నిముషాలు ఈ షార్ట్‌ వీడియోలు చూసేందుకు గడిపారు.మరి ముఖ్యంగా యువత ఈ షార్ట్‌ వీడియోల పైనే మొగ్గు చూపుతున్నారు.

డేటా ట్రాఫిక్‌ నాలుగేళ్లలో 60 రెట్లు పెరిగింది.ప్రపంచంలో ఇదే అధికం.

డేటా ట్రాఫిక్‌లో 4జీ వాటా 99 శాతం, 3జీ ఒక శాతం ఉంది.దేశవ్యాప్తంగా 4జీ డివైస్‌లు 60.7 కోట్లు.అలాగే 5జీ స్మార్ట్‌ఫోన్లు 20 లక్షలున్నాయి.2.2 కోట్ల బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు ఉన్నాయి.ప్రస్తుతం ఎఫ్‌టీటీహెచ్‌ ద్వారా 40 లక్షల గృహాలు, కార్యాలయాలు కనెక్ట్‌ అయ్యాయి.అలాగే స్మార్ట్‌ డివైసెస్‌ ఎక్కువ అవ్వడంతో డేటా వినియోగం కూడా ఎక్కువగా పెరుగుతుందని హ్యాపీ మొబైల్స్‌ సీఎండీ కృష్ణ పవన్‌ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube