అమెరికా బాటలో యూకే..6080 మంది భారతీయుల వీసాల రిజెక్ట్       2018-05-17   06:24:47  IST  Bhanu C

అమెరికా బాటలోనే యూకే ప్రభుత్వం కూడా నడుస్తోంది..భారతీయ ఎన్నారైలపై ఉక్కుపాదం మోపుతోంది..పలు రంగాల్లో నిష్ణాతులు అయిన భారతీయలకి వీసాలు ఇచ్చేందుకు నిరాకరిస్తోంది యూకే ప్రభుత్వం..సుమారు 6 వేలకు పైగా భారతీయుల వీసాలని యూకే ప్రభుత్వం నిరాకరిస్తోందని ఈ కలక నిర్ణయం ముందు ముందు మరింత ఖటినమైన దిశగా వెళ్ళబోతోందని ఒక నివేదికలో తేటతెల్లం అయ్యింది వివరాలలోకి వెళ్తే..

అమెరికా ప్రభుత్వం తమ దేశ పౌరులకోసం వారి ఉద్యోగాల కోసం ఎలా అయితే భారత ఎన్నారైల వీసాల విషయంలో ఇబ్బందులకి గురిచేస్తోందో అదే విధంగా యూకే శాతం తమ పౌరుల ఉద్యోగాల కోసం ఇండియన్ ప్రోఫెషనల్స్‌కు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది…తమ వీసా విధానంలో మార్పుల కారణంగా వీసాలు పొందలేక పోతున్నారని సమాచారం అందుతోంది.

2017 డిసెంబర్ నుండి ఇప్పటివరకు సుమారు 6,080 మంది ఇండియన్స్‌కు యూకే వీసాలు నిరాకరించినట్టు నివేదికలు తెలుపుతున్నాయి…భారత్ కి చెందిన ఇంజనీర్లు, ఐటీ ప్రోఫెషనల్స్, డాక్టర్లు, టీచర్లతో పాటు పలు రంగాల్లోని ప్రోఫెషనల్స్‌కు యూకే వీసాలను నిరాకరిస్తున్నారని భారతీయులకు యూకే వీసాలు కేవలం 57 శాతం మాత్రమే దక్కుతున్నాయని సీఏఎస్ఈ అనే సంస్థ గణాంకాలను వెల్లడించింది.

సైన్స్, ఇంజనీరింగ్ , టెక్నాలజీ రంగాల్లో భారత్, యూకేల మధ్య మేధోమదనం, సహాయ సహకారాల వల్ల తాము లాభం పొందామని సీఎఎస్ఈ డిప్యూటీ డైరెక్టర్ నయోమీ వేర్ తెలిపారు అయితే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ దెబ్బతిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు..అయితే భారతీయులకి ఎంతో నైపుణ్యం ఉందని అలాంటి నైపుణ్యం ఉన్న సేవలలో వారిని వినియోగించుకోవడం ఎంతో ముఖ్యమని అయితే ఈ విషయాలని యూకే ప్రభుత్వానికి ఒక నివేదిక ద్వారా తెలుపుతామని ఆమె తెలిపారు..