2022లో పెరగనున్న యూఎస్ పౌరసత్వం తీసుకునే వారి సంఖ్య.. టాప్-5లో భారతీయులు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా వెళ్లిన భారతీయులు అక్కడే స్థిరపడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కొన్నేళ్ల తర్వాత అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడి సమాజంలో కలిసిపోతున్నారు భారతీయులు.

 Indians Among The Top 5 Contingents In Us Citizenship Numbers, Indians, Uscis, M-TeluguStop.com

ప్రతి ఏటా అమెరికా పౌరసత్వం తీసుకునే వారిలో భారతీయుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.ఈ ఏడాది కూడా ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కొత్తగా పౌరసత్తం తీసుకున్న వారికి స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తోంది.తాజాగా జూలై 1 నుంచి 8 మధ్య కాలంలో అమెరికా పౌరసత్వం పొందిన 6,600 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సెప్టెంబర్ 30న ముగియనున్న 2022 ఆర్ధిక సంవత్సరానికి గాను యూఎస్‌సీఐఎస్ 6,61,500 మందికి అమెరికా పౌరసత్వాన్ని మంజూరు చేసింది.2021 ఆర్ధిక సంవత్సరంలో 8,55,000 మంది కొత్త పౌరులు ప్రమాణ స్వీకారం చేశారు.2022 తొలి త్రైమాసికంలో 1,97,000 మంది అమెరికన్ పౌరులుగా ప్రమాణ స్వీకారం చేశారు.డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ లాండ్ సెక్యూరిటీ డేటా ప్రకారం.

వీరిలో 34 శాతం మంది మెక్సికో (24,508); భారతదేశం (12,928); ఫిలిప్పీన్స్ (11,316); క్యూబా (10,689), డొమినికన్ రిపబ్లిక్ (7,046) దేశాలకు చెందిన వారే.

Telugu Cuba, Indians, Indianstop, Mexico, Uscis, Uscis Ur Jaddou-Telugu NRI

యూఎస్‌సీఐఎస్ డైరెక్టర్ ఉర్ జద్దౌ మాట్లాడుతూ.అమెరికా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ఆకర్షిస్తోందన్నారు.వలసదారులను తమ తోటి పౌరులుగా స్వాగతించేందుకు తాము కృషి చేస్తున్నామని జద్దౌ తలిపారు.

మన దేశంలో తమ జీవితాలను, ఆశలను పెట్టుబడిగా పెట్టిన 6,600 మందికి పైగా వ్యక్తులు జూలై 4న పౌరులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆమె పేర్కొన్నారు.అందువల్ల అమెరికా మరింత బలంగా, వైవిధ్యంగా వుంటుందని ఉద్దౌ ఆకాంక్షించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube