ఒక్క నెలలో 91 వేల మందికి ఉద్వాసన .. భారతీయులు దేశం వీడితే తీవ్ర పరిణామాలే : అమెరికాకు నిపుణుల హెచ్చరిక

కోవిడ్‌తో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే.తాజాగా ఆర్ధిక మాంద్యపు నీలినీడలు ప్రపంచవ్యాప్తంగా కమ్ముకుంటున్నాయి.

 Indians Among 91000 Laid Off In America In January 2023 Details, Indians ,91000-TeluguStop.com

దిగ్గజ సంస్థలైన మెటా, ట్విట్టర్‌,అమెజాన్, సేల్స్‌ఫోర్స్‌లలో అప్పుడే ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది.దీంతో కార్పోరేట్ రంగం.

ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో భయాందోళనలు నెలకొన్నాయి.ఈ పరిణామాలు అమెరికాలో హెచ్ 1 బీ వీసాతో పనిచేస్తున్న భారతీయులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి.

అమెరికన్ టెక్ సెక్టార్‌లో భారీ తొలగింపుల మధ్య అధిక సంఖ్యలో భారతీయ నిపుణులు నిరుద్యోగులుగా మారారు.

ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్ సంస్థలు హెచ్1 బీ వీసా హోల్డర్ల గ్రేస్ పీరియడ్‌ను రెండు నెలల నుంచి సంవత్సరానికి పైగా పొడిగించాలని అధ్యక్షుడు జో బైడెన్‌ను కోరుతూ ఆన్‌లైన్ పిటిషన్‌ను ప్రారంభించాయి.

దీని వల్ల ఒకసారి ఉద్యోగం పోతే హెచ్ 1బీ వీసా వున్న విదేశీ టెక్ వర్కర్‌ 60 రోజుల వ్యవధిలోగా కొత్త ఉద్యోగం సంపాదించుకోవాలి.లేదంటే అమెరికాను విడిచి స్వదేశానికి వెళ్లిపోవాలి.

తాజాగా కంపెనీల విజ్ఞప్తికి అమెరికా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.కొత్త ఉద్యోగాన్ని కనుగొనడానికి ఏడాది పాటు సమయం వుంటుంది.

Telugu Laid, America, Economical, Employees Lay, Hb Visa, Indian, Indians, Janua

నైపుణ్యం కలిగిన వారు అమెరికాను విడిచి వెళ్లిపోతే అది ఆ దేశానికే నష్టమని నిపుణులు అంటున్నారు.దీర్ఘకాలంలో అమెరికాలో ప్రతిభావంతుల కొరత ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.స్టార్టప్ వ్యవస్థాపకుల్లో 70 శాతం మంది వలసదారులే.ఇందులో దాదాపు 50కి పైగా కంపెనీల సీఈవోలు భారత సంతతికి చెందినవారే.అందువల్ల ఈ మేధో వలసలు దీర్ఘకాలంలో అమెరికా ప్రయోజనాలకు హానికరం.ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందిపుచ్చుకునేందుకు దేశాల మధ్య పోటీ వున్న ఈ సమయంలో ఇది మరింత విపత్కర పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Telugu Laid, America, Economical, Employees Lay, Hb Visa, Indian, Indians, Janua

నైపుణ్యం కలిగిన విదేశీ వృత్తి నిపుణులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో వివాదం వుంటూనే వుంటుంది.ఏటా హెచ్‌-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.వీటిలో కంప్యూటర్‌ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.వీటితో పాటు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.

అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి యేటా పదివేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్ కంపెనీలు హెచ్ 1బీ వీసాపై ఆధారపడుతున్నాయి.

Telugu Laid, America, Economical, Employees Lay, Hb Visa, Indian, Indians, Janua

LayoffTracker.com ప్రకారం.జనవరి 2023లో అమెరికాలో 91 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లుగా అంచనా.రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.అయితే ఓవర్సీస్‌లోని భారతీయులు యాక్టీవ్‌గా వుండే ఓ ఫేస్‌బుక్ గ్రూప్.తొలగించబడిన భారతీయ టెక్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆన్‌లైన్‌లో పిటిషన్ దాఖలు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube