ఆపరేషన్‌ పీఓకే షురూ

కశ్మీర్‌ అనేది ఇండియాలో భాగం అని, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ కూడా ఇండియాకే చెందుతుందని మరోసారి ఇండియన్‌ ఆర్మీ చీప్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు.పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ను ఇండియా ఆక్రమించుకుంటుందని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెల్సిందే.

 Indianarmy Chiefbipinravath Commentson Startoperation Pok-TeluguStop.com

ఇదే సమయంలో పాకిస్తాన్‌ ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు ఎంతకైనా సిద్దం అంటూ ప్రకటించారు.కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత నానా రచ్చ జరుగుతుంది.

కశ్మీర్‌పై పాక్‌కు ఉన్న పట్టు పోతుందని ఆ దేశం ఆందోళన చెందుతుంది.కశ్మీర్‌పైనే కాదు ఆ దేశం ఆక్రమించుకున్న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను కూడా స్వాదీనం చేసుకుంటామని బిపిన్‌ ప్రకటించారు.

తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న బిపిన్‌ రావత్‌ మాట్లాడుతూ ఆపరేషన్‌ పీఓకే ప్రారంభించామని, దాన్ని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను సొంతం చేసుకునే వరకు కొనసాగిస్తామంటూ ప్రకటించాడు.ఆ విషయమై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మరియు జనాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇండియన్స్‌ ఎప్పుడెప్పుడు పీఓకే మనది అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.బీజేపీ ప్రభుత్వానికే ఆ సత్తా ఉందని, మోడీ ఖచ్చితంగా పీఓకేను స్వాదీనం చేసుకుని తీరుతాడు అంటూ అంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube