విచిత్రం : అమ్మకానికి ఛారిత్రాత్మక నగరం.. రూ.26.3 కోట్ల రేటు  

Indiana Population Of 3 For Sale-

అమెరికా ఇండియానాలో ఉండే ఒక చిన్న పట్టణం స్టోరీ.వందలాది మంది నివాసం ఉండే వీలున్న ఈ పట్టణంలో ప్రస్తుతం ముగ్గురే ఉంటున్నారు.

Indiana Population Of 3 For Sale- Telugu Viral News Indiana Population Of 3 For Sale--Indiana Population Of 3 For Sale-

ఇప్పుడు ఆ ముగ్గురు కూడా పట్టణంను ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు.అందుకే ఈ పట్టణంను అమ్మేయాలని భావిస్తున్నారు.ఇండియన్‌ రూపాయల ప్రకారం 26.3 కోట్లకు పట్టణంను అమ్మేయాలని వారు భావిస్తున్నారు.ఆ ముగ్గురు చాలా కాలం క్రితం ఆ పట్టణంను కొనుగోలు చేయడం జరిగింది.పట్టణంలో అన్ని వసతులు ఉన్నా కూడా అక్కడ ఉండేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదు.

తక్కువ రేటుకే అయినా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.ఇంతకు ఈ పట్టణం కథ ఏంటీ? ఇక్కడ ఎందుకు జనాలు ఉండటం లేదు? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Indiana Population Of 3 For Sale- Telugu Viral News Indiana Population Of 3 For Sale--Indiana Population Of 3 For Sale-

1851లో జార్జ్‌ పి స్టోరీ అనే వ్యక్తి ఒహియో నుండి ఇండియానాకు వలస వచ్చాడు.ఇండియానాలోని ఒక ఖాళీ ప్రదేశంను ప్రభుత్వం నుండి కొనుగోలు చేశాడు.

173 ఎకరాలను అప్పట్లో తక్కువకు కొనుగోలు చేశాడు.ఆ ప్రాంతంకు స్టోరీ అనే పేరు పెట్టాడు.ఆయనతో పాటు మెల్ల మెల్లగా ఆయన కుటుంబ సభ్యులు ఇతరులు అక్కడకు రావడం మొదలు పెట్టారు.అలా మొత్తంగా రెండు వందల వరకు జనాబా అయ్యారు.

చిన్నపాటి పట్టణంగా అవ్వడంతో అక్కడ అన్ని వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.దాదాపు 130 ఏళ్ల పాటు ఆ పట్టణం జనాలతో, జనాబాతో కలకలలాడింది.

అయితే ఆ తర్వాత మెల్ల మెల్లగా ఆ పట్టణం ప్రాభవం కోల్పోయింది.ఉద్యోగాల రీత్యా పెద్ద పట్టణాలకు జనాలు వలుస పోగా, స్టోరీ పట్టణంలో జనాలు లేకుండా అయ్యారు.

అన్ని వసతులు ఉన్నా కూడా, పలు సినిమాల షూటింగ్‌లు అక్కడ జరుపుతూ, ఛారిత్రాత్మక నగరంగా పేరు దక్కించుకున్న కూడా స్టోరీ పట్టణంలో జనాలు ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు.దానికి కారణం దెయ్యం అనే ప్రచారం కూడా ఉంది.

కొన్ని సంవత్సరాల క్రితం ఒక మహిళ ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుందని, ఆమె ఆత్మగా మారి చుట్టు పక్కల తిరుగుతున్నట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతుంది.అందుకే ఆ పట్టణంపై ఎవరు ఆసక్తి చూపడం లేదు.

పగటి పూట ఆ పట్టణంను చూసేందుకు వందలాది మంది వెళ్లినా, రాత్రికి మాత్రం అక్కడ ఎవరు ఉండరు.

.

తాజా వార్తలు

Indiana Population Of 3 For Sale- Related....