27 అయస్కాంతాలను మింగేసిన బాలుడు.. చివరకు..?

చాలా సందర్భాల్లో చిన్నపిల్లలు తమ చేతికి ఏ వస్తువు దొరికితే ఆ వస్తువును నోట్లో పెట్టుకుంటూ ఉంటారు.కొన్ని సందర్భాల్లో ఆ వస్తువులు మరీ చిన్నవిగా ఉంటే నోటి ద్వారా కడుపులోకి వెళ్లి ప్రాణాలకే అపాయం తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది.

 Indiana Boy Rushed To Emergency Room After Eating 27 Magnets, 27 Magnets, Emerge-TeluguStop.com

తల్లిదండ్రులు పిల్లలు నోట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.తాజాగా ఇండియానాలో ఒక బాలుడు 27 అయస్కాంతాలను నోట్లో పెట్టుకుని పొరపాటున మింగేశాడు.

నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్న బాలుడు పెయిటన్ మింగేసిన అయస్కాంతాలు గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరి సరిగ్గా ఆడక గట్టిగా ఏడ్చేశాడు.బాలుడు ఏడుస్తూ ఉండటంతో కొన్ని నిమిషాల పాటు బాలుడి తల్లిదండ్రులు జెస్సికా, మ్యాక్ నెయిర్ లకు ఏం జరిగిందో అర్థం కాలేదు.

అదే సమయంలో ఇంట్లో ఉండే మ్యాగ్నెట్ బాల్స్ కూడా కనిపించకపోవడంతో బాలుడు వాటిని మింగేశాడనే అనుమానంతో వెంటనే బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆస్పత్రిలో ఎక్స్ రే తీసిన వైద్యులు బాలుడి కడుపులో 25, గొంతులో 2 మ్యాగ్నెట్ బాల్స్ ఉండటంతో అవాక్కయ్యారు.

శస్త్రచికిత్స చేసి బాలుడి కడుపులో ఉన్న మ్యాగ్నెట్ బాల్స్ ను డాక్టర్లు తొలగించారు.ప్రస్తుతం బాలుడు పెయిటన్ ఆరోగ్యం బాగానే ఉంది.

వైద్యులు మ్యాగ్నెట్ బాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.అవి ప్రాణాంతకం అని చెబుతున్నారు.

పిల్లలు ఒక్కరే చిన్నచిన్న వస్తువులతో ఆడుకునే సమయంలో వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలని సూచిస్తున్నారు.

బాలుడి తల్లి సైతం తల్లిదండ్రులకు మ్యాగ్నెట్ బాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది.

ప్రస్తుతం మ్యాగ్నెట్ బాల్స్ మింగిన పెయిటన్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.నిపుణులు పిల్లల ఆట వస్తువుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రమాదకరమైన వస్తువులకు పిల్లలను దూరంగా ఉంచాలని సూచనలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube