ప్రమాదంలో భారతదేశ పిల్లలు

మనం రోజూ చూసే పిల్లల్లో ఎంతమంది క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు? అతికష్టం మీద ఒకరో ఇద్దరినో చూడటం కూడా కష్టం.స్మార్ట్ ఫోన్లు వచ్చాక కనీసం బయటకెళ్ళి ఆడటం కూడా లేదు.

 Indian Youth In Healthy Risks With Bad Habits-TeluguStop.com

ఇప్పటి జెనరేషన్ కీ ఆటలంటే వీడియో గేమ్స్.అందుకే రోజురోజుకి బద్ధకస్తులుగా తయారవుతన్నారు.

పట్టుమని కిలోమీటరు కూడా నడవలేని స్థితి నేటి పిల్లలది.ఈ బద్దకం వల్ల మనదేశ పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

13-15 ఏళ్ళ వయసు గ్రూప్ లో, ప్రతి పదిమందిలో కనీసం ఏడుగురు పిల్లల వ్యాయామం చేయట్లేదట.అందులో ప్రతి ఐదుగురికి స్థూలకాయం సమస్యలు వస్తున్నాయట.

అలాగే ఆ వయసు పిల్లల్లో సిగరేట్ తాగడం ఒక ఫ్యాషన్ లాగా మారి, అప్పుడే ధూమపానం చేయడం, మద్యపానం జోలికి వెల్లడం కూడా జరుగుతోందని “పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో” రచయితల్లో ఒకరైన రేష్మా నాయక్ తెలిపారు.

ఇలాంటి అలవాట్లు, సరైన తిండి, వ్యాయామం లేక, గుండె సంబంధిత వ్యాధులు, శ్వాస సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ మరియు క్యాన్సర్‌ .ఈ నాలుగురకాల జబ్బులు వచ్చే అవకాశం భారతదేశంలో విపరీతంగా పెరిగిపోతోందని రేష్మా రిపోర్టు యొక్క సారాంశం.భారతదేశంలో 60% మరణాలు ఈ నాలుగు జబ్బుల వలనే సంభవిస్తున్నాయని ఈమధ్యే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా తెలపడం గమనార్హం.

” సిగరెట్లు, మద్యం లాంటి ప్రమాదకరమైన వస్తువుల మీద టాక్స్ రెట్లు ఎక్కువగా రుద్దాలి.వాటిని ఎవరు ప్రమోట్ చేయకుండా అడ్డుకోవాలి.

ఎలాగైనా సరే, పబ్లిక్ కి అవి చవకగా, సులువుగా అందుబాటులోకి రాకూడదు.అప్పుడే పరిస్థితుల్లో ఏమైనా మార్పు రావచ్చు.

లేదంటే భారతదేశం యొక్క భవిష్యత్తు ప్రమాదంలో ఉంది.అలాగే పిల్లలకి మంచి తిండి, అలవాట్ల మీద అవగాహన కల్పించాలి.

ఈ మార్పు ఇప్పుడు అత్యవసరం” అంటూ “పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో”కి రచన అందించిన మరో రచయిత తోషుకో కానేడా అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube