భారతీయ మహిళకి జైలు శిక్ష...ఇంత నీచానికి పాల్పడిందా..

అమెరికాలోని న్యూయార్క్ కోర్టు భారత సంతతి మహిళకి 22ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.మానవత్వం మరిచిపోయి ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఈ మహిళని క్షమించ కూడదని పేర్కొన్న జస్టీస్ ఆమెకి ఈ శిక్షని ఖరారు చేశారు.

 Indian Women In 22 Years In Jail-TeluguStop.com

ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమిటి.?? ఆమెకి ఎందుకు 22 ఏళ్ల శిక్షని అమెరికా కోర్టు విధించింది అనే వివరాల్లోకి వెళ్తే.

న్యూయార్క్ లోని క్వీన్స్ ప్రాంతంలో 2016 సంవత్సరం ఆగస్టులో షందాయి అర్జున్ అనే 55 ఏళ్ల భారత సంతతి మహిళ తన సవతి బిడ్డని అత్యంత కిరాతకంగా, గొంతు నులిమి చంపింది.ఆగస్టు 19న ఈ ఘాతుకానికి పాల్పడిన ఆమె తన మాజీ భర్త రేమండ్ నారాయణ, ఇద్దరూ మనవళ్ళు బయటకి వెళ్ళడం చూసిన అక్కడి ఓ వ్యక్తి చిన్నారి అనుదీప్ కౌర్ ఏదని ప్రసించాడు.

దానికి వారు సరైన సమాధానం చెప్పక దాటవేయడంతో అనుమానం వచ్చిన అతడు పోలీసులకి సమాచారం అందించాడు.

భారతీయ మహిళకి జైలు శిక్షఇంత

అప్పట్లో ఈ కేసుని నమోదు చేసుకున్న పోలీసులు సుదీర్భ విచారణ చేపట్టి సాక్ష్యాదారాలతో సహా కోర్టుకు సమర్పించారు.ఈ కేసుని పరిశీలించిన కోర్టు బాత్‌ రూమ్ లో ఈ మహిళ , తన సవతి బిడ్డని అత్యంత కిరాతకంగా చంపడం క్షమించదగ్గది కాదని సవతి తల్లికి 22 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పుని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube