భర్త సెక్స్ చేయట్లేదని పురుషాంగం కోసేసిన భారతీయ మహిళ     2018-02-05   03:42:27  IST  Raghu V

ఘజియాబాద్ కి చెందిన ఓ 30 ఏళ్ళ మహిళలకి పదేళ్ళ క్రితం పెళ్ళి జరిగింది. కాని ఆమెకి ఇంతవరకు సంతానప్రాప్తి లేదు. అయ్యో పాపం ఏదైనా లోపమా అని అనుకునేరు. ఎలాంటి లోపం లేదు. విచిత్రమైన విషయం ఏమింటంటే ఆమెకి సంసారంలో సుఖం కూడా లేదు. అర్థం కాలేదా? పెళ్ళి అయినప్పటినుంచి భర్త ఈమెతో శృంగారంలో పాల్గొనలేదట. మీకు నమ్మడానికి కష్టంగా అనిపిస్తున్న ఇది నిజమే.

భార్య వేడుకున్నా ఎప్పుడు చొరవ తీసుకునేవాడు కాదట. దశాబ్దకాలంలో శారీరక సుఖం లేకుండా, పిల్లల ముచ్చట లేకుండా నరకం చూస్తూ వచ్చిందట ఆవిడ. దీనికితోడు పిల్లల ఎందుకు కలగట్లేదు అని బయట స్నేహితులు, చుట్టాలు అడగటంతో మానసిక ఒత్తిడిని అనుభవించట ఆమె. దాంతో ఆవిడ కోపం కట్టలు తెంచుకుంది. నిన్న ఉదయం కూడా వారికి సెక్స్ లైఫ్ మీద వాగ్వివాదం జరిగింది. ఆ గొడవలో, తన పదేళ్ళ కోపాన్ని తీర్చేసుకుంది. ఏం చేసింది అనుకుంటున్నారు? కత్తి తీసుకోని అతని పురుషాంగాన్ని కోసేసింది.

సంఘటన జరిగిన తరువాత పారిపోలేదు. నిర్భయంగా పోలీసులతో మాట్లాడింది. పోలీసులతో మాట్లాడుతూ ” నాతో శారీరక సంబంధం పెట్టుకోకుండా మానసికంగా చిత్రవధ చేసాడు నా భర్త. తన మగతనం గురించి గొప్పగా చెప్పుకునేవాడు కాని, ఎప్పుడు నాతో సెక్స్ లో పాల్గొనలేదు. వీలైతే వేరే మహిళలతో పిల్లల్ని కంటాను కాని నాతో మాత్రం సెక్స్ లో పాల్గొననని, పిల్లల్ని కనను అని అనేవాడు. పదేళ్ళ నుంచి ఈ మానసిక హింస అనుభవిస్తూనే ఉన్నా. అందుకే కత్తితో అక్కడ దాడి చేసా. ఇలా చేసినందుకు బాధపడట్లేదు. ఇన్నేళ్ళుగా నా చుట్టాల దగ్గర, నా స్నేహితుల దగ్గర ఎలాంటి అవమానాలు అనుభవించానో నాకే తెలుసు” అంటూ తన బాధల్ని చెప్పుకుంది.

పోలీసులు ఖోడా పోలీసు స్టేషన్ లో కేసు ఫైల్ చేసారు. ఆ భర్తకి నోయిడాలోని ఓ హాస్పిటల్ లో చికిత్స జరుగుతుంది.