పొడవాటి జుట్టుతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన భారతీయ మహిళ..

ఇటీవల కాలంలో భారతీయులు స్పెషల్ ఫిజికల్ ఫీచర్లతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకుంటున్నారు.వారిలో తాజాగా మరొక మహిళ చేరింది.

 Indian Woman Created Guinness World Record With Long Hair, Smita Srivastava, Lon-TeluguStop.com

వివరాల్లోకి వెళ్లితే, భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల స్మితా శ్రీవాస్తవ ( Smita Srivastava )జీవించి ఉన్న వారిలో అత్యంత పొడవాటి జుట్టుగా కలిగి ఉన్న మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్(Guinness World Records ) టైటిల్‌ను సాధించింది.ఆమె జుట్టు 7 అడుగుల, 9 అంగుళాల పొడవు ఉంది, ఇది సగటు ఎబ్‌బీఎ ప్లేయర్ ఎత్తు కంటే ఎక్కువ.

14 ఏళ్ల నుంచి స్మిత జుట్టు కత్తిరించుకోలేదు.1980లలో హిందీ సినిమాల్లోని పొడవాటి జుట్టు గల నటీమణుల నుంచి ఆమె ప్రేరణ పొందింది.పొడవాటి జుట్టు భారతీయ సంస్కృతిలో అందం, దైవత్వానికి ప్రతీక అని కూడా ఆమె నమ్ముతుంది.“మన సొసైటీలో హెయిర్ కట్ చేయించుకోవడం అశుభంగా భావిస్తారు, అందుకే మహిళలు జుట్టును పెంచుకునేవారు. భారతీయ సంస్కృతిలో, దేవతలకు సాంప్రదాయకంగా చాలా పొడవాటి జుట్టు ఉంటుంది.అందుకే ఆడవారు కూడా అలాంటి జుట్టు పెంచుకుంటూ ఉంటారు.” అని స్మిత చెప్పారు.

Telugu Guinness, Care, Indian, Longest-Latest News - Telugu

నిజానికి ఏడడుగుల పొడవాటి జుట్టును మెయింటైన్ చేయడం అంత సులభం కాదు.స్మిత తన జుట్టును వారానికి రెండుసార్లు జడగా కడుతుంది, దీనికి 30 నుంచి 45 నిమిషాలు పడుతుంది.ఆమె దానిని టవల్‌తో ఆరబెట్టి, తన చేతులతో విడదీస్తుంది, దీనికి రెండు గంటల సమయం పట్టవచ్చు.ఆమె తన బెడ్‌పై నిలబడి, ఆమె జుట్టును మరేదైనా చిక్కుకోకుండా ఉండటానికి ఒక షీట్ వేసుకుని ఇలా చేస్తుంది.“నేను నా జుట్టు పూర్తిగా ఆరిపోయిన తర్వాత దువ్వెనతో దువ్వుకుంటాను, ఆపై దానిని అల్లడం లేదా బన్‌లో కట్టుకుంటాను.” అని స్మిత చెప్పింది.

Telugu Guinness, Care, Indian, Longest-Latest News - Telugu

స్మిత జుట్టు లూస్ గా వదిలేసి బయటకు వెళ్లినప్పుడల్లా చాలా మంది దృష్టిని ఆకర్షిస్తుంది.ప్రజలు ఆమె జుట్టును చూసి ఆశ్చర్యపోతారు.తరచుగా దానిని తాకవచ్చా, దానితో సెల్ఫీలు దిగవచ్చా , ఇంత పెద్ద జుట్టు కోసం ఆమె ఏ ఉత్పత్తులను ఉపయోగిస్తుందో తెలుసుకోవాలని అడుగుతారు.“ఇంత పొడవాటి జుట్టు తనకు నిజంగానే ఉందని ప్రజలు త్వరగా నమ్మలేరు.” అని స్మిత తెలిపింది.ఈ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ టైటిల్‌ తన కల అని, అది ఇప్పుడు నెరవేరిందని స్మిత చాలా సంతోషంగా చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube