అమెరికా: రక్తపు మడుగులో శవాలుగా తేలిన భారతీయ జంట .. చిన్నారి ఏడుపుతో వెలుగులోకి

అమెరికాలో భారతీయ దంపతులు అనుమానాస్పద స్థితిలో శవాలుగా తేలారు.వివరాల్లోకి వెళితే.మహారాష్ట్రలోని బీద్‌ జిల్లాకు చెందిన బాలాజీ రుద్రావర్‌ (32) ఐటీ ఉద్యోగి.2015 ఆగస్టులో ఆయన ఉద్యోగరీత్యా భార్య ఆర్తి (30), నాలుగేళ్ల కుమార్తెతో కలిసి అమెరికా వెళ్లారు.ప్రస్తుతం ఆర్తి 7 నెలల గర్భిణి.ఈ క్రమంలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం బాలాజీ కుమార్తె న్యూజెర్సీలోని నార్త్‌ ఆర్లింగ్టన్‌లో గల తన ఇంటి బాల్కనీలో గుక్కపెట్టి ఏడుస్తూ కన్పించింది.

 Indian Techie, Wife Found Dead In Us  Daughter, 4, Seen Crying On Balcony, Mahar-TeluguStop.com

చిన్నారి ఎంతకీ ఏడుపు ఆపకపోవడం, తల్లిదండ్రులు కూడా పట్టించుకోకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపు తీసేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది.దీంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా.

బాలాజీ, ఆర్తి దంపతులు లివింగ్‌ రూంలో రక్తపుమడుగులో విగత జీవులై కన్పించారు.ఇద్దరి శరీరాలపై బలంగా కత్తిపోట్లు ఉన్నాయి.

లోపలి నుంచి గడియ పెట్టి వుండటం… ఆగంతకులు వచ్చిన జాడ కూడా లేకపోవడంంతో పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

అయితే ఈ ఘటనపై అమెరికన్ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి.

బాలాజీ తన భార్యను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడి వుంటాడన్నది ఈ కథనాల సారాంశం.అయితే పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ అసలు కారణాలు చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు బాలాజీ, ఆర్తి దంపతుల మృతిపై మహారాష్ట్రలోని ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.తన కొడుకు, కోడలు చాలా సంతోషంగా ఉండేవారని… ఎవరితోనూ వారికి విబేధాల్లేవని, అలాంటప్పుడు ఈ దారుణం ఎలా జరిగిందో తెలియడం లేదని బాలాజీ తండ్రి.

భరత్‌ రుద్రావర్‌ కన్నీటి పర్యంతమయ్యారు.బాలాజీ కుమార్తె అతని స్నేహితుడి సంరక్షణలో ఉంది.

బాలాజీ అమెరికాలోని ఒక ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా… ఆర్తి గృహిణి.

చట్టపరమైన లాంఛనాలన్నీ పూర్తి చేసుకుని బాలాజీ, ఆర్తి మృతదేహాలు భారతదేశానికి రావడానికి 8 నుంచి 10 రోజుల సమయం పడుతుందని సమాచారం.

దీంతో వీరి కుటుంబసభ్యులు ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.అటు అమెరికాలోని భారతీయ సంఘాలు సైతం మృతదేహాల తరలింపుపై రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube