అమెరికాలో భారతీయ టెకీ దారుణ హత్య...!!

అమెరికాలో మిసౌరిలో భారతీయ టెకీ దారుణ హత్యకు గురైన సంఘటన కలకలం రేపుతోంది.గడిచిన కొన్ని రోజులుగా ఆసియా అమెరికన్స్ పై దాడులు జరిగిన నేపధ్యంలో భారతీయ టెకీ మృతి ఈ కోణంలో జరిగిందేమో అనే అనుమానం ఒక వైపు, లేదంటే జాత్యహంకార హత్య అనే అనుమానం ఇలా పోలీసులు పలు కోణాలలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 Indian Techie Brutally Murdered In America-TeluguStop.com

అయితే పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి.భారతీయ టెకీ హత్య వెనుకాల ట్రయాంగిల్ లవ్ స్టొరీ ఉందని కనుగొన్నారు.

కేవలం ఓ మహిళ వలన వచ్చిన వివాదంలో ఓ అమెరికన్ భారతీయ టెకీ రెహమాన్ ఖాన్ ను హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు.వివరాలలోకి వెళ్తే.

 Indian Techie Brutally Murdered In America-అమెరికాలో భారతీయ టెకీ దారుణ హత్య…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన హరీఫ్ రెహమాన్ ఖాన్ అనే వ్యక్తీ అమెరికాలో టెకీ గా స్థిరపడ్డాడు.సెయింట్ లూయిస్ యూనివర్సిటీ సిటీ అపార్ట్మెంట్ లో బుల్లెట్ గాయాలతో పడి ఉన్న అతడిని గుర్తించిన కొందరు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన అతడు చనిపోక ముందే పోలీసులకు తనను కాల్చింది ఎవరనే విషయం వెల్లడించడంతో అసలు విషయం బయటపడింది.

రెహమాన్ చనిపోతూ తనను కాల్చింది మిల్లర్ అనే వ్యక్తని చెప్పడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.జరిగిన విషయం చెప్పమని తమ స్టైల్ లో అడగడంతో మిల్లర్ హత్యకు దారితీసిన పరిస్థితులు చెప్పాడు.

రెహమాన్ కు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉందని ఆమె తనకు ఫ్రెండ్ అని అయితే ఘటన జరిగిన రోజున సదరు యువతి ఉండే యూనివర్సిటీ కి ఇద్దరూ వెళ్ళగా అక్కడ ఘర్షణ జరగడంతో వెంటనే తన వద్ద ఉన్న తుపాకీతో రెహమాన్ ను హత్య చేసినట్టుగా మిల్లర్ ఒప్పుకున్నాడు.దాంతో అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

#Miller #Indian Tech #St.Louis #Racist Murder

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు