సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటో: భారతీయ ఉపాధ్యాయుడికి జరిమానా  

Indian Teacher In Dubai Asked To Pay $2,722 As Fine In Defamation Case-indian Teacher In Dubai,nri,telugu Nri News Updates

పరువు నష్టం కేసులో దోషిగా తేలిన భారత సంతతి ఉపాధ్యాయుడికి 10,000 దిర్హామ్‌లు (2,722 డాలర్లు) జరిమానా చెల్లించాలని దుబాయ్ కోర్టు ఆదేశించింది.

Indian Teacher In Dubai Asked To Pay $2,722 As Fine In Defamation Case-indian Teacher In Dubai,nri,telugu Nri News Updates Telugu NRI USA America Latest News (తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసా-Indian Teacher In Dubai Asked To Pay $2 722 As Fine Defamation Case-Indian Nri Telugu Nri News Updates

గతేడాది జూన్ 4న 40 ఏళ్ల భారతీయ మేనేజర్ ఫోటోను అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

దాని కింద కుక్క ఫోటో పెట్టి… ‘‘ మా వద్ద మంచి జాతి కుక్కలు అమ్మకానికి’’ ఉన్నాయి అని క్యాప్షన్‌గా పెట్టాడు.దీనిపై ఆ మేనేజర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌, సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు.

దర్యాప్తు సమయంలో ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కూడా దీనిని పోస్ట్ చేసినట్లు ఓ భారతీయ మహిళ నుంచి తెలుసుకున్నట్లు ఆ మేనేజర్ దర్యాప్తు అధికారికి తెలిపారు.

దీనిపై సుధీర్ఘ విచారణ నిర్వహించిన కోర్టు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మరొక వ్యక్తి మార్ఫింగ్ ఫోటోను పోస్ట్ చేసినందుకు అతనిని దోషిగా నిర్థారించినట్లు ఖలీజ్ టైమ్స్ గురువారం తన కథనంలో ప్రచురించింది.న్యాయస్థానం అతని స్మార్ట్‌ఫోన్‌ను జప్తు చేయడంతో పాటు పోస్ట్‌ను డిలీట్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మూసివేసింది.ఫిర్యాదుదారు పరువుకు కలిగిన భంగానికి 10,000 దిర్హామ్‌లు (2,722 డాలర్లు) జరిమానా విధిస్తూ తుది తీర్పును వెలువరించింది.

.

తాజా వార్తలు