యూఏఈలో కరోనాకి భారతీయ హిందీ టీచర్ బలి

పుట్టి ఆరు నెలలు కావొస్తున్నా ప్రపంచవ్యాప్తంగా కరోనా దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు.తొలుత చైనా, తర్వాత ఇరాన్, అమెరికా.

 Indian Teacher Dies Of Coronavirus In Uae,uae, Indian Teacher, Coronavirus-TeluguStop.com

ఇప్పుడు రష్యా, బ్రెజిల్‌ను ఓ చూపు చూస్తోంది కోవిడ్ 19.ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినపడి 3,47,873 మంది ప్రాణాలు కోల్పోగా… 55,88,356 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.ఈ లిస్టులో భారతీయులూ ఉన్నారు.భారత్‌తో పాటు వివిధ దేశాల్లోనూ మనవాళ్లు ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.తాజాగా యూఏఈలో ఓ భారతీయుడు కరోనాకు బలయ్యాడు.

50 ఏళ్ల అనిల్ కుమార్ అబుదాబీలోని సన్‌రైజ్ స్కూల్‌లో హిందీ టీచర్‌గా పనిచేస్తున్నాడు.ఈ నేపథ్యంలో మే 7న ఆయన కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలాడు.అప్పటి నుంచి ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న అనిల్ కుమార్ మే 24న ప్రాణాలు కోల్పోయినట్లు సన్‌రైజ్ స్కూల్‌ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.

వృత్తిపట్ల ఆయన అంకిత భావం, మంచి వ్యక్తిత్వంతో అనిల్ కుమార్ అందరితో సన్నిహితంగా మెలిగేవారని, ఆయన మరణం తమ సంస్థకు తీరని లోటని సన్‌రైజ్ స్కూల్ తెలిపింది.అనిల్ కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఈయన భార్య రజిని కూడా సన్‌రైజ్ స్కూల్‌లో మేథమేటిక్స్ బోధిస్తున్నారు.కాగా యూఏఈలో ఇప్పటి వరకు 30,000 మంది కోవిడ్ 19 బారినపడగా.245 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube