చైనాలో మన విద్యార్థుల నరకయాతన

చైనాలో వందలాది మంది మృతికి కారణం అయిన కరోనా వైరస్‌ మరెంత మందిని బలి తీసుకుంటుందో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది.పెద్ద ఎత్తున ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకోవడంతో పాటు వైరస్‌ను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.

 Indian Students Suffering In Chaina-TeluguStop.com

ఈ సమయంలో చైనాలోని పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిపి వేయడం జరిగింది.కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నిషదిత వాతావరణం కనిపిస్తుంది.

ఇంట్లోంచి బయటకు కూడా రావద్దంటూ ప్రభుత్వం సూచిస్తుంది.దాంతో చైనాలో వైధ్య విధ్యను అభ్యసిస్తున్న వందలాది మంది ఇండియన్‌ విద్యార్థులు ఇప్పుడు ఇండియాకు తిరిగి వచ్చేందుకు సిద్దం అవుతున్నారు.

ఇండియా వెళ్లేందుకు వారు రెడీ అయిన సమయంలో చైనా ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ ఒక్కరిని చైనా నుండి బయటకు పంపేది లేదని, అలాగే బయటి దేశాల నుండి చైనాకు ఏ ఒక్కరిని రానిచ్చేది లేదు అంటూ ఆంక్షలు విధించింది.ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులు నరకయాతన పడుతున్నారు.

కొన్ని ప్రాంతాల్లో టెలీకమ్యూనికేషన్‌ వ్యవస్థ కూడా సరిగా లేక పోవడంతో తమ పిల్లలు ఎలా ఉన్నారో తెలియక ఇండియాలో వారి తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube