అమెరికాలో ఆ భారతీయ విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం..??  

Indian Students In America Concerned About Future-

అమెరికాలో ఎంతో మంది భారతీయ విద్యార్ధులు వివిధ యూనివర్సిటీలలో విద్యని అభ్యసిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన నకిలీ వీసా విషయంలో ఫర్మింటన్ వర్శిటీని మూసేసి 130 మంది తెలుగు విద్యార్థులపై కేసులు పెట్టి వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం అందరికి తెలిసిందే అయితే తాజాగా అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మరింత మంది భారతీయ విద్యార్ధులు తమ భవిష్యత్తు పై బెంగ పెట్టుకున్నారు..

అమెరికాలో ఆ భారతీయ విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం..??-Indian Students In America Concerned About Future

ఫర్మింటన్ యూనివర్సిటీ లా ఇంకెన్ని అలాంటి వర్సిటీలు ఉన్నాయో గుర్తించి వాటిని కూడా మూసేయాలని భావిస్తోంది. ఒక వేళ ఇదే గనుకా జరిగితే వేలాదిమంది భారతీయ విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది.

దాదాపు 80 వేల మంది విద్యార్థులు అమెరికాని వదిలేయడమే కాకుండా న్యాయపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఇలా గుర్తించిన వర్సిటీలలో ఐదు వర్సిటీలు ఉండగా వాటిలో 80 వేలమంది ఉన్నారని వారిలో దాదాపు 50 వేల మంది భారతీయ విద్యార్ధులు ఉన్నారని అంటున్నారు. ఇదిలాఉంటే అమెరికాలో ఉంటున్న వలసదారులు ఈ నెల 5వ తేదీలోపు దేశం విడిచి వెళ్లాలని హుకుం జారీ చేయడంతో అమెరికాలో ఉంటున్న విద్యార్ధుల్లో భవిష్యత్తు పై బెంగ మొదలయ్యింది.