ఇంగ్లీష్ టెస్ట్‌లో మోసం ..ఆ కేసులో మా పేర్లు తొలగించండి : రిషి సునాక్‌ను కోరిన భారతీయ విద్యార్ధులు

ఆంగ్ల భాషా పరీక్షలలో మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో దాదాపు పదేళ్ల క్రితం భారతీయులు సహా పలువురు విదేశీ విద్యార్ధుల వీసాలను యూకే ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మంగళవారం అంతర్జాతీయ విద్యార్ధుల బృందం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌( British Prime Minister Rishi Sunak )ను కలిసింది.

 Indian Students Ask Uk Pm Rishi Sunak To Clear Their Names In English Test Scand-TeluguStop.com

ఈ కేసుకు సంబంధించి తమ పేర్లను తొలగించాలని వారు కోరారు.అంతర్జాతీయ విద్యార్ధులు భాషా పరీక్షా కేంద్రాలలో మోసం చేసినట్లుగా 2014లో బీబీసీ డాక్యుమెంటరీ కథనాన్ని ప్రసారం చేసింది.

దీనిని సీరియస్‌గా తీసుకున్న అప్పటి బ్రిటన్ ప్రభుత్వం సదరు విద్యార్థుల వీసాలను రద్దు చేసింది.

ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్( Educational Testing Service ) (ఈటీఎస్) అనే సంస్థ 96 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహించింది.

ఈ క్రమంలో యూకే హోం ఆఫీస్ 34,000కు పైగా విదేశీ విద్యార్ధుల వీసాలను ఉన్నపళంగా రద్దు చేసింది.తద్వారా వారు రాత్రిపూట దేశంలో ఉండటం చట్ట విరుద్ధం.

అలాగే నాడు పరీక్ష రాసిన మరో 22,000 మందికి ఫలితాలు ప్రశ్నార్థకమని చెప్పింది.ఈ విద్యార్ధులు తమ విశ్వవిద్యాలయాల నుంచి బహిష్కరణకు గురయ్యారు.

అంతేకాదు.యూకేలో ఉండటానికి, పనిచేయడానికి, కనీసం అప్పీలుకు కూడా అవకాశం లేకుండా చేశారు.

Telugu Educational, Indian, Scandal-Telugu NRI

అయితే ఈ మోసానికి సంబంధించిన సాక్ష్యాలలో లోపాలను న్యాయస్థానాలలో ఎత్తిచూపడంతో కొందరు విద్యార్ధులు కేసులలో గెలిచారు.కానీ కొందరు మాత్రం చిక్కుల్లో కూరుకుపోయారు.ఈ నేపథ్యంలో మంగళవారం వీరు డౌనింగ్ స్ట్రీట్‌ (బ్రిటన్ ప్రధాని కార్యాలయం)కి పిటిషన్ సమర్పించారు.బాధిత విద్యార్ధులలో 46 ఏళ్ల భారతీయ మహిళ( Indian woman ) కూడా వున్నారు.

ఆమె పదేళ్లుగా తన పిల్లల నుంచి వేరుగా వుంటోంది.తనపై వున్న అభియోగాలను తొలగించాల్సిందిగా బాధితురాలు పలుమార్లు సంఘాన్ని కోరారు.

తమ కేసుపై నిర్ణయాన్ని పున: పరిశీలన చేయాల్సిందిగా రిషి సునాక్‌ను బాధితులు విజ్ఞప్తి చేశారు.

Telugu Educational, Indian, Scandal-Telugu NRI

ఈ కేసు నుంచి బయటపడిన విద్యార్ధులు తమ చదువుకు, ఉద్యోగానికి వీలుగా వీసాలను పునరుద్ధరించాలని ప్రధానిని కోరారు.పబ్లిక్ అకౌంట్స్ కమిటీ( Public Accounts Committee ) 2019 నివేదిక ప్రకారం.హోం ఆఫీస్ విదేశీ విద్యార్ధులకు జరిమానా విధించడంలో తొందరపడింది.

అలాగే ETS మోసానికి పాల్పడ్డారా లేదా అన్న దానికి నమ్మదగిన సాక్ష్యాధారాలు వున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు.ఇంత జరిగినా హోం ఆఫీస్ తన చర్యల వల్ల జరిగిన తప్పులను సరిదిద్దడానికి చర్యలు తీసుకోకపోవడం సరికాదని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తప్పుబట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube