యూఏఈలోని భారతీయ విద్యార్ధులకు శుభవార్త.. ఇకపై ఎన్ఐటీ, ఐఐఐటీలలో సీట్ల రిజర్వేషన్

యూఏఈలో నివసించే భారతీయ విద్యార్ధులు, ఇతర విదేశీ పౌరులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఐఐఐటీలు, ఎన్ఐటీలు సహా ఇతర కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే (ఐఐటీలు మినహా) సంస్థల మొత్తం సీట్లలో 15 శాతం విదేశాల్లోని విద్యార్ధుల ప్రత్యక్ష ప్రవేశ పథకం (డీఏఎస్ఏ) కింద రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

 Indian Students And Foreign Nationals In Uae Can Now Get 15% Of The Seats At Iii-TeluguStop.com

కేంద్ర విద్యా శాఖ ద్వారా నోటిఫై చేయబడిన .విదేశాల్లోని విద్యార్ధుల ప్రత్యక్ష ప్రవేశ (డీఏఎస్ఏ) పథకం కింద భారత్‌లోనూ, ఇతర దేశాలలో చదువుతున్న భారత సంతతికి చెందిన వ్యక్తుల పిల్లలు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (పీఐవో), ఎన్ఆర్ఐల పిల్లలు భారత్‌లో సాంకేతిక విద్యను అభ్యసించవచ్చు.కేంద్ర విద్యా శాఖ నోటిఫికేషన్ ప్రకారం.2022- 23 విద్యా సంవత్సరానికి అర్హులైన విద్యార్ధుల కోసం ఈ పథకం వివరాలను మిషన్ ప్రకటించింది.

2021-2022 విద్యా సంవత్సరం నుంచి డీఏఎస్ఏ పథకం కింద అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లను ఎన్‌టీఏ నిర్వహించిన జేఈఈలో విద్యార్ధులు పొందిన ర్యాంకుల ఆధారంగా తయారు చేస్తారు.విదేశాల నుంచి చెల్లుబాటు అయ్యే అర్హత పరీక్ష (జేఈఈ మెయిన్ ర్యాంక్) స్కోరుతో గత ఎనిమిదేళ్లలో ఏదైనా దేశంలో 12వ తరగతి లేదా తత్సమానమైన కోర్సును కలిగి వున్న భారత జాతీయులు దీనికి అర్హులు.

వివిధ విభాగాల్లో దామాషా ప్రకారం సీట్లు అందుబాటులో వుంటాయి.ఈ సీట్లు సూపర్ న్యూమరీగా వుండాలి.ప్రస్తుతం ఈ పథకం కింద 3,900 యూజీ.1300 పీజీ సీట్లు కేటాయిస్తున్నారు.

Telugu Daca Institute, Dasa Scheme, Iiits, Indianforeign, Nit India, Nits, Citiz

డీఏసీఏ కో ఆర్డినేటింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే జేఈఈ మెయిన్ ర్యాంక్, తర్వాత కౌన్సెలింగ్ ఆధారంగా రూపొందించిన మెరిట్ జాబితా ప్రకారం అడ్మిషన్లు లభిస్తాయి.డీఏసీఏ పథకం కింద అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ / అప్లికేషన్ ఫీజు 300 అమెరికా డాలర్లు కాగా.ట్యూషన్ ఫీజు 8,000 అమెరికా డాలర్లు.సార్క్ దేశాల్లోని జాతీయులు (భారత్ మినహా) సార్క్ దేశాలలో అర్హత పరీక్ష (జేఈఈ మెయిన్)లో ఉత్తీర్ణులైతే 50 శాతం ట్యూషన్ ఫీజు మినహాయింపు ఇస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube