అమెరికాలోని భారతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్...ఇకపై....!!!!

అమెరికా ఇచ్చే పర్యాటక వీసా కోసం ఏళ్ళ తరబడి వేచి చూడాల్సిన పరిస్థితిని నెలకొన్న విషయం విధితమే.అమెరికాలో ఉన్న తమ పిల్లలను చూసుకోవడం కోసం ఈ పర్యాటక వీసా పొందేందుకు తల్లి తండ్రులు పడిగాపులు కాస్తున్నారు.

 Good News For Indian Students In America,america,student Visa,opt,visa Stamping,-TeluguStop.com

అయితే ఈ పరిస్థితుల నుంచీ గట్టెక్కేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అమెరికాలో స్టూడెంట్ వీసాపై ఉంటున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వారు భారత్ తో సహా ఇతర దేశాలకు వెళ్లి తిరిగి అమెరికా వచ్చేటప్పుడు విసా స్టాంపింగ్ అవసరం లేకుండానే అమెరికాలోకి ప్రవేసించవచ్చునని ప్రకటించింది.

అమెరికాలో స్టూడెంట్ వీసా పై ఉంటున్న వారు ఇతర దేశాలకు వెళ్లి వచ్చే సమయంలో వీసా స్టాంపింగ్ వేయించుకుని రావాలి అలాగే ఇంటర్వ్యూ లో కూడా పాల్గొనాల్సి వచ్చేది.అయితే ఈ పరిస్థితిని నుంచీ మినహాయింపును ఇస్తోంది అమెరికా.

ఇకపై భారతీయులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్లి వచ్చే టప్పుడు లేదంటే సొంత దేశానికి వెళ్లి వచ్చే క్రమంలో ఎలాంటి విసా స్టాంపింగ్, ఇంటర్వ్యూలు ఇకపై ఉండవని తెలిపింది.

స్టూడెంట్ వీసా దారుడితో పాటు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ఉన్న స్టూడెంట్స్ కి కూడా ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది.ఈ వీసా భారతీయ విద్యార్ధులకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే.పర్యాటక వీసా జారీ ఉన్న సమయాభావం కారణంగా ఎంతో మంది తల్లి తండ్రులు తమ పిల్లలను చూసుకోవడానికి లేకుండా పోతోంది, పైగా అంత ఖర్చులు పెట్టుకుని విద్యార్ధుల తల్లి తండ్రులు వచ్చే అవకాశాలు కూడా చాలా మందిలో తక్కువగా ఉంటాయి.

ఈ నేపధ్యంలో అమెరికాలో విద్యను అభ్యసిస్తున్న వారి పిల్లలు ఎలాంటి నిభందనలు లేకుండా భారత్ లో ఉన్న తల్లి తండ్రులను కలిసి తిరిగి అమెరికా వచ్చేయచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube