సింగపూర్: భారతీయ విద్యార్ధి బృందం ప్రతిభ... స్పేస్‌లోకి పంపేందుకు సాఫ్ట్‌వేర్ రూపకల్పన

ప్రపంచంలో ఎక్కడ వున్నా భారతీయ విద్యార్ధులు , శాస్త్రవేత్తలు తమ సత్తా చాటుతున్నారు.తాజాగా సింగపూర్ లోని ప్రతిష్టాత్మకమైన నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్‌టీయూ)కి చెందిన పరిశోధక బృందంలో ఒక భారతీయ విద్యార్ధి కూడా వున్నాడు.

 Indian Student-led Team In Singapore's Ntu To Send Machine Learning Software To-TeluguStop.com

వీరు రూపొందించిన మెషీన్ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్ త్వరలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)పైకి వెళ్లనుంది.అతని పేరు అర్చిత్ గుప్తా.

ఇతని నేతృత్వంలోని ఎన్‌టీయూ బృందం.స్పేస్ అప్లికేషన్స్ కోసం కృత్రిమ మేథస్సును ఉపయోగించి వినూత్న మార్గాలను అభివృద్ధి చేయడంపై జరిగిన పోటీలో గెలుపొందింది.

అనంతరం ఐఎస్ఎస్ లో తన ప్రాజెక్ట్ ను పరీక్షించే అవకాశాన్ని పొందింది.

రాబోయే మూడు నెలల్లో ఈ బృందం సాఫ్ట్‌వేర్ ను చిన్నసైజు సూపర్ కంప్యూటర్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాక్స్ లో ఇన్‌స్టాల్ చేస్తుంది.

అనంతరం దానిని భౌతికంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తరలిస్తారు.స్పేస్‌లో అంతరాయాలను సింగిల్ ఈవెంట్ అప్‌సెట్ అంటారు.ఇవి అంతరిక్షంలో సున్నితమైన విద్యుత్ భాగాలను ప్రభావితం చేస్తాయని ఈ బృందం తెలిపింది.

Telugu Indianntu, Min-Telugu NRI

వీరు తయారు చేసిన సాఫ్ట్‌వేర్ ‘‘క్రీమర్’’ .ఇది ఐఎస్ఎస్ లేదా ఉపగ్రహాలపై హార్డ్‌‌వేర్ అంతరాయాలను అంచనా వేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది.ఈ అంతరాయాల వల్ల అంతరిక్ష నౌకలు క్రాష్ అయ్యే అవకాశం వుంది.

ఒకే ఈవెంట్ అప్‌సెట్‌లను కూడా పరిష్కరిస్తున్న క్రీమ్ అనే ఇప్పటికే వున్న సాఫ్ట్‌వేర్ పేరును కొనసాగిస్తూ.కొత్త దానికి ‘‘క్రీమర్’’ అని పేరు పెట్టారు.తాము దానికి మెరుగైన వెర్షన్ తీసుకురావాలని భావించామని.అందుకే క్రీమర్ అని పేరు పెట్టినట్లు గుప్తా వెల్లడించాడు.

ఈ ప్రాజెక్ట్.స్పేస్ టెక్నాలజీలో గేమ్ ఛేంజర్ అని చెబుతున్నారు.

ఇక.అర్చిత్ గుప్తా బృందంలో సీ మిన్ (22), డియోన్ లిమ్ (24), రష్నా అహ్మద్ (21) మిగిలిన సభ్యులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube