అమెరికాలో తెలుగు విద్యార్ధికి జైలు శిక్ష..భారీ జరిమానా..  

Indian Student In Us Faces 10 Years Jail For Destroying Computers-akuthota Vishwanath,destroying Computers,indian Student,usb Killer,ఆకుతోట విశ్వనాథ్‌

ఓ తెలుగు ఎన్నారై విద్యార్ధి న్యూజిలాండ్ వర్సిటీలో యూఎస్‌బీ టెక్నాలజీ ద్వారా థంబ్ డ్రైవ్ ని ఉపయోగించి దాదాపు 59 కంప్యూటర్స్ ని ద్వంసం చేసిన ఘటన విషయం అందరికి తెలిసిందే. ఈ కేసుకు సంభందించి అతడికి దాదాపు 10 ఏళ్ల జైలు శిక్ష సుమారు 250,000డాలర్లు అంటే రూ.కోటీ 73లక్షలు జరిమానా విధించారు..

అమెరికాలో తెలుగు విద్యార్ధికి జైలు శిక్ష..భారీ జరిమానా..-Indian Student In US Faces 10 Years Jail For Destroying Computers

ఆ విద్యార్ధి పేరు ఆకుతోట విశ్వనాథ్‌. ఈ కేసుకు సంభందించి ప్రాసిక్యూషన్‌ తెలిపిన వివరాల ప్రకారం. న్యూజిలాండ్‌లో నివాసముంటున్న విశ్వనాథ్‌ అమెజాన్‌ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా యూఎస్‌బీ కిల్లర్‌ని కొనుగోలు చేశాడు.

ఆ తరువాత ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి తాను చదువుతున్న న్యూయార్క్‌ వర్సిటీకి చెందిన 59 కంప్యూటర్లను ధ్వంసం చేశాడు.

అయితే ఈ కంప్యూటర్స్ పని చేయకపోవడానికి గల కారణాలని గుర్తించిన వర్సిటీ కంప్యూటర్లు విశ్వనాథ్‌పై అనుమానం వ్యక్త పరిచి పోలీసులని సమాచారం అందించింది. దాంతో కోర్టులో యూనివర్సిటీ తరుపున న్యాయవాది బలమైన వాదన వినిపించారు. పిటిషనర్‌ తరుఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఈ శిక్షని ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు.