భారతీయ విద్యార్ధి ఆలోచన దుబాయ్ లో హీరోని చేసింది..

మనసు ఉండాలే కానీ మార్గం అదే కనపడుతుంది.నీతిగా నిజాయితీగా చేసే ప్రతీ పని ఎంతో మందిలో ఆలోచన కలిగిస్తుంది, కొత్త మార్గాన్ని సృష్టిస్తుంది.

 Indian Student Idea Makes A Hero In Dubai ,  Aarush,  Student Of Indian Descent,-TeluguStop.com

ఓ భారతీయ విద్యార్ధి చేసిన ఓ చిన్న ఆలోచన అతడిని హీరోగా నిలబెట్టింది.దుబాయ్ లో ఉంటూ అక్కడే విధ్యాభ్యాసం చేస్తున్న ఆరుష్ అనే భారత సంతితికి చెందిన విద్యార్ధి ఆలోచన దుబాయ్ లోని ప్రతీ ఒక్కరిని ఆలోచింప చేస్తోంది, వారిచే ప్రశంసలు కురిపిస్తోంది.

వివరాలోకి వెళ్తే.

నిత్యం మనం వాడే పేపర్, పుస్తకాలు ఇవన్నీ లక్షలాది అడవులును నరకడం వలన వాటి ద్వారా వచ్చే కలపను వాడటం వలన వచ్చేవే.

అయితే ఇంత పెద్ద మొత్తంలో అడవులు, చెట్లు నరకడం వలన గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతోందని ప్రపంచానికి తీవ్ర నష్టం వాటిలుతుందని ఆలోచన చేశాడు ఆరుష్.ఈ క్రమంలోనే ఓ యాప్ ను రూపొందించాడు.

ఈ యాప్ వాడటం వలన ఎంతో మేలు జరుగుతుందని అది ఎలా జరుగుతుందో వివరించి చెప్పాడు.ఆరుష్ చెప్పిన విధానం, రూపొందిచిన యాప్ లు చూసి ముచ్చటపడిన దుబాయ్ ప్రజలు, విద్య వేత్తలు ఆరుష్ పై ప్రసంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇంతకీ అతడు రూపొందించిన యాప్ ఏంటంటే.

Telugu Aarush, Books, Paper, Reusekitab, Indian-Telugu NRI

ఆరుష్ దుబాయ్ లోని ఇంటర్నేషనల్ అకాడమీలో 10th చదువుతున్నాడు.తన విద్యా సంవత్సరం ముగిసిన తరువాత తన పుస్తకాలు వేరే విద్యార్ధులకు విరాళంగా ఇవ్వడం వలన పుస్తకాల కొనుగులు తగ్గుతుందని తద్వారా కొంతైనా చెట్లను నరకడం ఆగుతుందని ఆలోచించాడు.అందుకోసం పుస్తకాల విరాళాలు చేయడం కోసం Reusekitab అనే యాప్ ను రూపొందించాడు.

ఈ యాప్ గురించి చెప్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో దాదాపు 120 కి పైగా స్కూల్స్ అందులో రిజిస్టర్ అయ్యాయి.దాంతో ఈ యాప్ కాస్తా దుబాయ్ వ్యాప్తంగా పాపులర్ అవడంతో ఆరుష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు దుబాయ్ వాసులు.

అంత చిన్న వయసులో సమాజహితం కోరుతూ ఆరుష్ చేసిన ప్రయత్నం ఎంతో గొప్పగా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube