అమెరికాలో భారత విద్యార్ధి దుర్మరణం...!!!  

Indian Student Died At University Kingston Campus-nri,telugu Nri News Updates

సుహేల్ హబీబ్ అనే భారత విద్యార్థి అమెరికాలో 2016 నుంచీ యూఆర్‌ఐలో చదువుకుంటున్నాడు. అయితే రోడ్ ఐలాండ్ యూనివర్సిటీ కింగ్స్‌టన్ క్యాంపస్ టూటెల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద ఉన్న కొలనులో మునిగి దుర్మరణం చెందాడు.ఈ ఘటన ఒక్క సారిగా యూనివర్సిటీ లో కలకలం రేపింది..

అమెరికాలో భారత విద్యార్ధి దుర్మరణం...!!!-Indian Student Died At University Kingston Campus

సరదాగా ఈత కొట్టడానికి యూనివర్సిటీ లోని స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళిన అతడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. అయితే వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, వైద్యులు వెంటనే అక్కడకు చేరుకునే లోగానే అక్కడ ఉన్న కొందరు అతడికి కృత్రిమ శ్వాస అందిస్తూ వచ్చారు.

ఈలోగా వచ్చిన పోలీసులు ఘటన స్థలం నుంచీ ఆసుపత్రి కి తీసుకుని వెళ్ళారు..

అయితే ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే హబీబ్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని వెల్లడించిన వర్సిటీ యాజమాన్యం. ఈ సంఘటన జరగడం ఎంతో భాధాకరమని తెలిపింది…భారత్ లో ఉంటున్న అతడి తల్లి తండ్రులకి ఈ ఘటనని తెలిపినట్టుగా యూనివర్సిటీ ప్రకటించింది.