బరువు ఎవరైనా పెరుగుతారు.తగ్గిన వారే గ్రేట్.
ఐదు పది కేజీలు తగ్గాలంటేనే పలువురు రోజుల తరబడి జిమ్ లో గడుపుతారు.రకరకాల వ్యాయామాలు చేస్తారు.
కానీ.కొందరు సెలబ్రిటీలు పదుల కేజీల కొద్ది బరువు తగ్గి ఆశ్చర్య పరిచారు.
ఇంత బరువు ఎలా తగ్గారురా బాబోయ్ అనిపించారు.బరువు తగ్గాలనే బలమైన కోరిక, మంచి ట్రైనర్లు, ఎక్సర్ సైజ్, స్టిక్ట్ డైట్ ఫాలో కావడంతో భారీగా బరువు తగ్గారు.
అలా తగ్గిన వారిలో సినిమా నటులతో పాటు బిజినెస్ పర్సన్స్ ఉన్నారు.ఇంతకీ వారెవ్వరో తెలుసుకుందాం.
అద్నాన్ సమీ
బాలీవుడ్ టాప్ సింగర్, మ్యూజీషియన్ అద్నాన్ సమీ ఒకప్పుడు భారీ దేహంతో ఉండేవారు.అయితే దాదాపు 16 నెలల పాటు కష్టపడి 160 కేజీల బరువు తగ్గాడు.మంచి వ్యాయామం, తగిన డైట్ వలన ఇంత బరువు తగ్గాడు.
గణేష్ ఆచార్య
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య సైతం భారీగా బరువు తగ్గాడు.18 నెలల పాటు కఠిన వ్యాయామం చేసి 85 కిలోల వెయిట్ లాస్ అయ్యాడు.మంచి ట్రైనర్ కారణంగా ఈ బరువు తగ్గినట్లు చెప్పాడు గణేష్.
అనంత్ అంబానీ
ఇండియన్ టాప్ బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ.ఒకప్పుడు 200 కేజీల బరువు ఉండేవాడు.సుమారు 20 నెలల పాటు శ్రమపడి 108 కిలోల బరువు తగ్గాడు.ఇందుకోసం రోజుకు 21 కిలోమీటర్లు వాకింగ్, 5 గంటలు జిమ్ చేసేవాడు.దీనికి అదనంగా డైట్ మెయింటెన్ చేశాడు.
సారా అలీ ఖాన్
బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ సినిమాల్లోకి రాక ముందు భారీగా బరువు ఉండేది.సుమారు 100 కిలోల వరకు వెయిట్ ఉండేది.సినిమాల్లోకి రావాలని భావించి ఏడాది పాటు తీవ్రంగా శ్రమించింది.46 కేజీల బరువు తగ్గి 50 కేజీలకు చేరింది.యోగాతో పాటు జిమ్ చేయడం మూలంగా ఆమె బరువు తగ్గింది.