రూ.151 కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్.. యూఎస్‌లో భారత సంతతి వ్యక్తి అరెస్ట్

అమెరికాలో ఓ భారత సంతతి వ్యక్తి డ్రగ్స్‌‌ను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు.వివరాల్లోకి వెళితే.ప్రబజ్యోత్ నగ్రా అనే యువకుడు జూన్ 25న అర్థరాత్రి సమయంలో రూ.151 కోట్ల విలువైన 1000 కిలోల గంజాయిని తన ట్రక్కులో అక్రమంగా కెనడా నుంచి అమెరికాకు తరలిస్తున్నాడు. పీస్ బ్రిడ్జిపోర్ట్ మార్గం ద్వారా నగ్రా పోలీసుల కళ్లుగప్పి…డ్రగ్స్‌ను అమెరికాకు చేరవేసే ప్రయత్నం చేశాడు.

 Indian Held On Charges Of Smuggling Drugs Into Us,  Smuggling Drugs,us-TeluguStop.com

అయితే కస్టమ్స్ అధికారుల, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అతనిని అడ్డుకుని వెహికల్ కార్గో ఇన్స్‌పెక్షన్ సిస్టం ద్వారా తనిఖీ చేయడంతో నగ్రా గుట్టు బయటపడింది.8,320 వాక్యూమ్ సీల్డ్ ప్యాకేజీల్లో 1,000 కిలోల గంజాయి దొరికిందని అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ 20 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.151) ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.డ్రగ్స్ రవాణా చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ప్రబజ్యోత్‌కు పదేళ్ల నుంచి జీవితఖైదు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube