నాగు పామును చంపి తినేసిన కోడిపుంజు

అత్యంత విషపూరితమైన నాగుపాము చూస్తే వెంటనే భయంతో పరుగులు తీస్తాం.లేదంటే చేతిలో కర్ర ఉంటే కొట్టి చంపేస్తాం.

 Indian Rooster Swallows Baby Cobra Like A Noodle-TeluguStop.com

కొందరు నాగుపాముని భక్తితో పూజిస్తారు.ఏది ఏమైనా ఈ పాము ఎదురుగా కనిపిస్తున్న మాత్రం భయంతో వణికి పోవడం గ్యారంటీ.

అయితే మనుషులు తరహాలో జంతువులు కూడా ఒక్కసారి పాములకు భయపడతాయి.కానీ ఈ మధ్యకాలంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఇప్పుడు అలాంటి సంఘటన మెదక్ జిల్లాలో కనిపించింది.ఓ కోడి పుంజు నాగుపాముపై దాడి చేసింది.

అంతటితో ఆగకుండా పాము తనని ఎక్కడ చంపెస్తుందో అనే భయంతో తానే నాగుపామును మింగేసింది.ఈ సంఘటన మెదక్ జిల్లాలోని శివంపేట మండలం శభాష్‌పల్లిలో వెలుగు చూసింది.

కోళ్లు గుంపు ఒక చోట ఉన్నప్పుడు నాగుపాము వచ్చింది.పడగ విప్పుతూ బుసలు కోళ్ళ మీదకి బుసలు కొట్టింది.వాటిపై దాడికి ప్రయత్నం చేసింది.దానిని గమనించిన కోళ్లు తిరిగి దాడికి దిగాయి.

ఇంతలో ఓ కోడి అమాంతం ఆ పామును నోటకరిచి మింగేసింది.ఈ విచిత్ర సంఘటనను చూసిన స్థానికులు నోరెళ్లబెట్టారు.

అసలు శాఖాహారం తప్ప మాసాహారం జోలికి పోనీ కోడి పుంజు ఇలా ఉన్నపళంగా పాముని మింగేయడం అందరిని షాక్ కి గురించేసింది.కలికాలంలో బ్రహ్మం గారు చెప్పిన సంఘటను జరుగుతాయంటే ఏమో అనుకున్నాం నిజంగానే జరుగుతున్నాయి అని అందరూ మాట్లాడుకోవడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube