రైల్వే స్టేషన్ లో కలకలం, జనరల్ కోచ్ లో మహిళ ఆత్మహత్య  

Indian Railways Woman Passenger Commits Suicide In Chennai Howrah Mail Train - Telugu Chennai, Indian Railways,, Woman Passenger

రైలులో ప్రయాణించిన ఓ మహిళ మరుగుదొడ్డిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చెన్నై రైల్వే స్టేషన్‌లో కలకలం సృష్టించింది.పశ్చిమ బెంగాల్‌లోని హౌరా – చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు మధ్య హౌరా మెయిల్‌ను ప్రతిరోజూ నడుపుతున్నారు.హౌరా నుంచి ఈ రైలు మంగళవారం వేకువజామున 3.20 గం.లకు చెన్నై రైల్వే స్టేషన్‌లోని నాలుగో ప్లాట్‌ఫాంకు చేరుకుంది.అనంతరం జనరల్ కోచ్‌లోని మరుగుదొడ్డికి వెళ్లిన ఆ ప్రయాణీకురాలు చాలా సేపటి తర్వాత కూడా బయటకు రాలేదు.

 Indian Railways Woman Passenger Commits Suicide In Chennai Howrah Mail Train

దీనితో తోటి ప్రయాణికుడు ఎంత సేపు మరుగుదొడ్డి తలుపుకొట్టినా లోపలి నుంచి సమాధానం లేకపోవడంతో అనుమానం చెందిన అతడు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీనితో రైల్వే మెకానిక్‌ని పిలిపించిన పోలీసులు దగ్గరుండి మరుగుదొడ్డి తలుపును తెరిపించి చూడగా విస్మయం కలిగించే ఘటన చోటుచేసుకుంది.

ఆ మరుగుదొడ్డి లోపల మరుగుదొడ్డి లోపు 35 ఏళ్ల వయస్కురాలైన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.దీనితో వెంటనే వైద్యులను పిలిపించగా అప్పటికే ఆ మహిళ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు నిర్థారించారు.

రైల్వే స్టేషన్ లో కలకలం, జనరల్ కోచ్ లో మహిళ ఆత్మహత్య-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఆత్మహత్యకు పాల్పడిన మహిళ ఎవరు? అసలు ఆమె ఎందుకు ఇలా రైలు లో ఆత్మహత్యకు పాల్పడింది అన్న వివరాలపై రైల్వే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Railways,indian Railways Woman Passenger Commits Suicide In Chennai Howrah Mail Train,woman Passenger- Related Telugu News,Photos/Pics,Images..