Indian Railways Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆ మార్గాలలో స్పెషల్ ట్రైన్స్.. వివరాలు ఇవే

రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే తీపి కబురు అందించింది.నాందేడ్-యశ్వంతపూర్ మార్గంలో తాజాగా చాలా స్పెషల్ ట్రైన్లను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.మొదటగా నాందేడ్-యశ్వంతపూర్ మార్గంలో డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో ట్రైన్ నం.07093 స్పెషల్ ట్రైన్‌ను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.అలానే ఇదే మార్గంలో ఈనెల 6, 13, 20, 27 తేదీల్లో స్పెషల్ ట్రైన్ నం.07094ని నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

 Indian Railways Special Trains In These Routes Details, Indian Railway, Special-TeluguStop.com

పైన పేర్కొన్న రెండు ట్రైన్స్ పూర్ణ, పర్భాణి, బీదర్, వాడీ, రాయిచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యల్హంక స్టేషన్లలో కాసేపు ఆగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.ప్రయాణికుల సౌకర్యార్థం ఈ స్పెషల్ ట్రైన్స్‌లో 2AC, 3AC, స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని సదరన్ రైల్వే వెల్లడించింది.ఈ రెండు ట్రైన్లతో పాటు ట్రైన్ నం.07414 జాల్నా-తిరుపతి మార్గమధ్యంలో డిసెంబర్ 11, 18, 25, జనవరి 1వ తేదీల్లో స్పెషల్ గా నడుస్తుందని వెల్లడించింది.తెలిపింది.ఈ ట్రైన్‌ను ఆదివారం మాత్రమే నడుపుతారు.

Telugu Indian Railway, Southernindian, Trains, Tirupati Trains-Latest News - Tel

ఇక ట్రైన్ నం.07413 అనేది తిరుపతి-జాల్నా మార్గంలో డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో నడుస్తుంది.ట్రైన్ నం.07651 జాల్నా-ఛప్రా మార్గంలో డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రయాణ సేవలను అందిస్తుంది.ఈ మార్గాల్లో ప్రయాణించేవారు తమ జర్నీని ఈ స్పెషల్ ట్రైన్స్‌లో ప్లాన్ చేయడం ద్వారా ప్యాసింజర్ల రద్దీ నుంచి బయటపడొచ్చు.అలానే చాలా సుఖవంతమైన ట్రైన్ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

మరిన్ని వివరాలకు సమీపంలోని రైల్వే స్టేషన్లలో లేదా అధికారిక ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ విజిట్ చేయవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube