మీరు ఎప్పుడైనా అనకొండ లాంటి రైలును చూశారా...?

భారత రైల్వే శాఖ కొత్త చరిత్రను సృష్టించింది.భారత రైల్వే చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది.

 Train Looks Like Anaconda, Train, Goods Train, Indian Railways, Long Train-TeluguStop.com

ఇప్పటివరకు ఎప్పుడూ చేయని విధంగా ఏకంగా మూడు గూడ్స్ రైల్స్ ను జత కలిపి ఒకే రైలు గా తయారు చేసి దానిని నడిపి రికార్డును సృష్టించింది.ఈ రికార్డ్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కు చెందిన బిలాస్ పూర్ డివిజన్ లో చోటుచేసుకుంది.

డివిజన్ కు చెందిన మూడు గూడ్స్ రైళ్లను ఒకే గూడ్స్ ట్రైన్ గా జత చేసి కొత్త రికార్డును సృష్టించారు.ఈ సంఘటన పై రైల్వే శాఖ తెలిపిన సమాచారం ప్రకారం… పూర్తి లోడుతో ఉన్న మూడు గూడ్స్ రైళ్లను జత కలిపి బిలాస్ పూర్ – చక్రధర్ పూర్ డివిజన్ల మధ్య ఇంత పెద్ద ఎత్తున సరుకులను నడిపించారు.

అయితే ఇంత పెద్ద ఎత్తున్న తరలించడం ఇదే మొదటిసారి అని తెలిపింది.ఇందులో ఏకంగా పది వేల టన్నులకు పైగా సరుకును రవాణా చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.

నిజానికి ఇందులో మూడు గూడ్సు రైళ్ల భోగి లను కలపడంతో అదో పెద్ద అనకొండ ను పోలినట్లుగా కనబడుతోంది.దీని ద్వారా గూడ్స్ రైలు సరుకుల రవాణా సమయాన్ని తగ్గించేందుకు రైల్వే శాఖ కొత్త ఆలోచన చేపట్టినట్లు తెలుస్తోంది.

ఈ మధ్యకాలంలో రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపిన వివరాల ప్రకారం… కరోనా సంక్షోభంలో ఎరువులు, బొగ్గు, ఆహారధాన్యాలు మొదలగు నిత్యవసర సామగ్రిని తరలించడం పై రైల్వే శాఖ దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు.

Telugu Goods Train, Indian Railways, Long Train, Train, Train Anaconda-Telugu Vi

ఇక మరోవైపు శ్రామిక్ రైళ్ల ద్వారా మహా నగరాల్లో ఉండే వలస కూలీల వారి గమ్యస్థానాలకు ఇప్పటికీ చేరుస్తుంది రైల్వేశాఖ.అయితే ఇప్పటికీ దేశంలో ప్యాసింజర్ రైళ్ల కదలికను మాత్రం పరిమితం చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.అయితే రవాణాకు సంబంధించిన గూడ్స్ రైలు మాత్రం పూర్తి సేవలు యధాతథంగా నడుస్తున్నాయని ఆయన తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube