ఆ ప్రాంతాల నుంచి ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఇక అదనపు భారం తప్పదా…?  

Indian Railways Hikes Charges, Ticket Prices, Indian Railways, AC First Class - Telugu Ac First Class, Charges, Indian Railway, Indian Railways, Indian Railways Hikes Charges, Passengers, Railway, Railway Department, Ticket Prices, Trains

మరోసారి రైల్వే టికెట్ ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది రైల్వే శాఖ.లేటెస్ట్ టెక్నాలజీతో తీర్చిదిద్దిన రైల్వేస్టేషన్లలో నుండి బయలుదేరి ప్రయాణికులకు ఇకపై పది రూపాయల నుండి 35 రూపాయల వరకు అదనంగా వసూలు చేసే అవకాశం ఉంది.

TeluguStop.com - Indian Railways Hikes Ticket Prices

ఇందుకు సంబంధించి టిక్కెట్ ధరలను పెంచే ప్రపోజల్ రెడీ చేసి అతి త్వరలోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందేందుకు రంగం సిద్ధం అయినట్లు సమాచారం తెలుస్తోంది.ప్రయాణికులు ఏ తరగతిలో సీట్ రిజర్వేషన్ చేయించుకున్నారో అందుకు సంబంధించి రుసుమును పెంచేటట్లుగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

ఇందుకు సంబంధించి ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులపై అత్యధికంగా 35 రూపాయలు వరకు ప్రయాణ భారం పడే అవకాశం ఉండగా మిగతా ప్రయాణికులకు 30 రూపాయల నుండి 10 రూపాయల వరకు భారం పడేలా కనబడుతోంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 7000 రైల్వేస్టేషన్లు ఉన్నాయి.

TeluguStop.com - ఆ ప్రాంతాల నుంచి ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఇక అదనపు భారం తప్పదా…-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే కొత్త సౌకర్యాలు, కొత్త టెక్నాలజీ ని ఉపయోగించడం లాంటి సదుపాయాలను కల్పించడం మొదలగు కారణాల వల్ల ఈ రుసుమును వసూలు చేస్తున్నట్లు రైల్వే స్పష్టం చేసింది.

ఇకపోతే ప్రస్తుతం దేశంలో 1000 స్టేషన్ల నుండి ప్రయాణం సాగించే వారిపై అదనపు భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇలాంటి రుసుము ఇప్పటివరకు మనం విమాన ప్రయాణాల్లో మాత్రమే చూసే వాళ్ళం.ఇకపై ఈ బిల్ పాస్ అయితే రైల్వే లో కూడా ఇలాంటి రుసుమును మనం గమనించవచ్చు.

ఇలా అధిక రుసుమును వసూలు చేయడం ద్వారా వచ్చే సొమ్మును మిగతా స్టేషన్ల అభివృద్ధి ఉపయోగిస్తున్నట్లు రైల్వే ప్రణాళికలు రచిస్తోంది.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొన్ని సర్వీసులు మాత్రమే రైల్వే శాఖ నడుపుతోంది.

కరోనా వైరస్ నేపథ్యంలో చాలా మంది రైల్వేలో ప్రయాణించడానికి అంతగా ఆసక్తి చూపించలేదు.దీంతో చాలా స్టేషన్లు వెలవెలబోతున్నాయి.

ఏదిఏమైనా భారతీయ రైల్వేకి ఇదివరకు కళ రావాలంటే మరింత సమయం పట్టేలా కనబడుతుంది.

#Ticket Prices #AC First Class #Charges #Railway #Indian Railway

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Railways Hikes Ticket Prices Related Telugu News,Photos/Pics,Images..