వీడియో: వేగవంతమైన హైస్పీడ్ డబుల్ డెక్కర్ రైలు రెడీ..!  

RCF Kapurthala rolls out double-decker train coach with 160 kmph speed , double-decker train, 160 kmph speed ,RCF Kapurthala, First high speed double decker train ,Indian Railways - Telugu 160 Kmph Speed, Double-decker Train, First High Speed Double Decker Train, Indian Railways, Rcf Kapurthala, Rcf Kapurthala Rolls Out Double-decker Train Coach With 160 Kmph Speed, Train

తాజాగా భారత రైల్వే మరో అద్భుతాన్ని సృష్టించింది.దేశంలోనే కపూర్తల లోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లో సెమీ హై స్పీడ్ డబుల్ డెక్కర్ రైలును తయారు చేశారు.

TeluguStop.com - Indian Railways Double Decker Train Piyush Goyal

ఈ ట్రైన్ లో ఒక్కొక్క కోచ్ లో 120 సీట్లు ఉండగా.అందులో అప్పర్ డెక్ లో 50 మంది ప్యాసింజర్లు, లోయర్ డెక్ లో 48 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు.

అలాగే మిడిల్ డెక్ లో 16 సీట్లు ఒకవైపు మరోవైపు 6 సీట్లు కూర్చొని ప్రయాణం చేయవచ్చు.

TeluguStop.com - వీడియో: వేగవంతమైన హైస్పీడ్ డబుల్ డెక్కర్ రైలు రెడీ..-General-Telugu-Telugu Tollywood Photo Image


ఇందుకు సంబంధించి ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుందని భారతీయ రైల్వే సంస్థ తెలుపుతోంది.

లగేజ్ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా రాక్స్ ను కూడా అమర్చారు.అలాగే ప్రయాణికుల ఎలక్ట్రానిక్ పరికరాలకు చార్జింగ్ పెట్టుకోవడానికి చార్జర్స్ ను కూడా అందించారు.

ఇందుకు సంబంధించి జిపిఎస్ బేస్డ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టం మనకి అందుబాటులో ఉంటుంది.ఈ కోచ్ లోపలికి ఎంటర్ అయ్యే సమయంలో ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్ ను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ.డబల్ డెక్కర్ కోచ్ లో మినీ ప్యాంట్రీ ఉండడం తో దూర ప్రయాణాలకు పోయేటప్పుడు టీ, కాఫీ, స్నాక్స్, కూల్డ్రింక్స్ లాంటివి ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.ఈ కోచ్ ను ఎయిర్ స్ప్రింగ్ సస్పెన్సు సిస్టమ్ ద్వారా తయారు చేయడం ద్వారా ఇందులో ప్రయాణిస్తే కచ్చితంగా గాల్లో తేలినట్లు గానే ఉంటుందని అధికారులు తెలిపారు.

వీటితో పాటు ఈ కోచ్ లో ఫైర్ అండ్ స్మోక్ డిటెక్టర్ సిస్టం, సీసీటీవీ కెమెరాలు లాంటి ప్రత్యేక సెక్యూరిటీ మెజర్స్ ను రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇందుకు సంబంధించి వీడియోను తాజాగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.అయితే ఇది వరకు మొదటి బ్యాచ్ నాన్ ఏసి డబుల్ డెక్కర్ రైలును 90వ దశకంలోనే తయారు చేయగా ఏసి డబుల్ డెక్కర్ కోచ్ లను ఇప్పుడు తయారు చేయగలిగారు.ఈ ట్రైన్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని రైల్వే శాఖ తెలుపుతోంది.

అయితే ఇందుకు సంబంధించి పూర్తి పరీక్షలు జరిపిన తర్వాతనే భారతీయ రైల్వే లోకి అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలియజేశారు.

#160 Kmph Speed #RCFKapurthala #RCF Kapurthala #Train #FirstHigh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Railways Double Decker Train Piyush Goyal Related Telugu News,Photos/Pics,Images..