భారతీయ ప్రతిభ కెనడాకు తరలివెళ్తోంది.. ఆపండి: యూఎస్ కాంగ్రెస్‌కు ఇమ్మిగ్రేషన్ నిపుణుల హెచ్చరిక

కాలం చెల్లిన హెచ్ 1 బీ వీసా విధానం కారణంగా అమెరికా నుంచి ప్రతిభావంతులైన భారతీయులు కెనడా వైపు ఆకర్షితులవుతున్నట్లు ఇమ్మిగ్రేషన్ విధాన నిపుణులు అమెరికా చట్టసభ సభ్యులకు తెలియజేశారు.ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్, శాశ్వత నివాసం జారీ చేయడానికి అమల్లో వున్న కంట్రీ క్యాప్ విధానం ఇందుకు ప్రధాన కారణమని వారు తెలిపారు.

 Indian Talent Moving To Canada Due To Outdated H-1b Visa Policy, U.s. Lawmakers-TeluguStop.com

భారతీయ ప్రతిభ అమెరికా నుంచి కెనడాకు తరలి వెళ్లకుండా నిరోధించడానికి కాంగ్రెస్ మరింత వేగంగా పనిచేయాలని నిపుణులు విజ్ఞప్తి చేశారు.భారతీయుల ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డులు లేదా శాశ్వత నివాస అనుమతి కింద దాఖలయ్యే దరఖాస్తుల బ్యాక్‌లాగ్‌లు ప్రస్తుతమున్న 9,15,497 నుంచి 2030 ఆర్ధిక సంవత్సరానికి 21,95,795కి పెరుగుతుందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టువర్ట అండర్సన్ కాంగ్రెస్‌కు తెలిపారు.

ఒక దశాబ్ధకాలంలో దాదాపు 2 మిలియన్ల మందికి పైగా ప్రజలు ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోసం ఏళ్లు, దశాబ్ధాలు వేచి చూడాల్సి వస్తోందని అండర్సన్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ హౌస్ జ్యుడిషియరీ సబ్ కమిటీ ముందు ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చారు.

కాలం చెల్లిన అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలు మనదేశానికి అగ్రశ్రేణి ప్రతిభను ఎలా రప్పించగలదని అండర్సన్ ప్రశ్నించారు.అంతర్జాతీయ విద్యార్ధులతో పాటు నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులు ప్రస్తుతం అమెరికా కంటే కెనడా వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు.

Telugu America Process, Canada, Visa Policy, Indiancanada, Indians, Outd Hb Poli

యూఎస్ ఫౌండేషన్‌లలో గ్రాడ్యుయేట్ స్థాయి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్ధుల సంఖ్య 2016-17, 2018-19 విద్యా సంవత్సరాల్లో 25 శాతం పైగా తగ్గిందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ విశ్లేషించింది.గ్రాడ్యుయేట్ స్థాయి అంతర్జాతీయ విద్యార్ధుల్లో మూడింట రెండొంతుల మంది భారతీయులేనని ఫౌండేషన్ తెలిపింది.అదే సమయంలో కెనడా విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందుతున్న భారతీయ విద్యార్ధుల సంఖ్య 2016లో 76,075 నుంచి 2018లో 1,72,625కి చేరిందని కెనడియన్ బ్యూరో ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ తెలిపింది.అంటే 127 శాతం పెరుగుదల అన్నమాట.

Telugu America Process, Canada, Visa Policy, Indiancanada, Indians, Outd Hb Poli

ప్రతిభా వంతులకు దేశంలో సులభంగా ప్రవేశం దక్కేలా చేయడంలో అమెరికా కంటే కెనడా ఇమ్మిగ్రేషన్ విధానాలు బాగున్నాయని అండర్సన్ తెలిపారు.స్మార్ట్‌ఫోన్లు, ఈ కామర్స్, సోషల్ మీడియా, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాకముందు 1990లలో అమెరికా కాంగ్రెస్ ఇమ్మిగ్రేషన్ విధానాలను రూపొందించిందని ఆయన చెప్పారు.అయితే 90వ దశకం తర్వాత ప్రపంచం మారినట్లుగా.యూఎస్ ఇమ్మిగ్రేషన్ విధానం మారలేదని అండర్సన్ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube