కరోనాపై యుద్దంకు రాష్ట్రపతి తనవంతు సాయం

దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ను విధించిన కారణంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి భారత్‌ నెట్టివేయబడుతోంది.ఈ సమయంలో పీఎం రిలీఫ్‌ ఫండ్‌ కు విరాళాలు ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ కోరిన విషయం తెల్సిందే.

 Indian President Donate The One Month Pm Relife Fund To Corona Effected Peoples,-TeluguStop.com

ప్రతి ఒక్కరు కూడా తమకు తోచినంత విరాళం ఇవ్వడం ద్వారా పేదలను ఆదుకున్న వారు అవుతారంటూ మోడీ పేర్కొన్నారు.ఈ సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు కూడా మోడీ పిలుపుకు ముందుకు వచ్చి లక్షలు కోట్లల్లో విరాళాలు అందిస్తున్నారు.

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా తనవంతు సాయంగా ఒక నెల జీతంను పూర్తిగా కరోనా వైరస్‌ పై పోరాటంకు విరాళంగా ఇస్తున్నట్లుగా ప్రకటించారు.ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి కట్టుగా ఉండాలంటూ ఆయన పిలుపునిచ్చారు.

కరోనాతో పోరాటం అంటే పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వడం అని అందుకే ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా గృహ నిర్భందంలో ఉండాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube