అరుదైన గౌరవం దక్కించుకున్న కాకినాడ కోటయ్య కాజా...

కాకినాడ కాజా కి అరుదైన గౌరవం దక్కింది.ప్రత్యేకంగా రాష్ట్రంలోని కాకినాడలో తయారయ్యే కోటయ్య కాజా కి ఎంత గిరాకీ ఉందో చెప్పనవసరం లేదు.

 Indian Postal Department Release A New Stamps On Kakinada Kotaiah Kaja Name-TeluguStop.com

అయితే ప్రస్తుతం కాకినాడ కోటయ్య కాజా కి తపాలా శాఖ నుంచి అరుదైన గౌరవం లభించింది.ఇందులో భాగంగా కోటయ్య కాజా పేరు మీదుగా భారతీయ  తపాలాశాఖ పోస్టల్ స్టాంపులు విడుదల చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో కాజా అంటే ముందుగా గుర్తొచ్చేది కాకినాడ కోటయ్య కాజా….ఈ కాజా కి ఎంత ప్రాముఖ్యత ఉందంటే ఈ దీని రుచి తెలిసిన వారు ఏకంగా ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నారు.

కాజలో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి. అందులో గొట్టం కాజా, మడత కాజా, చిట్టి కాజా అనేవి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.ఈ మూడింటిలోనూ గొట్టం కాజా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.అంతేగాక వీటిని నేతితో చేయడంతో  వీటిని రుచి చుసిన వారు ఎవరైనా ఇట్లే ఫిదా అయిపోతారు.

Telugu Indian, Kakinada Kaja, Kakinadakotaiah, Kotaiah Kaja-Latest News - Telugu

అయితే అయితే గతంలో వీటిని కోటయ్య అనే వ్యక్తి తయారు చేసి తెలుగు రాష్ట్రాల్లో అమ్మడం మొదలు పెట్టాడు.  దీంతో వీటికి రాన్రాను మంచి గిరాకీ పెరగడంతో ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నారు.దీంతో వీటికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించిన భారత తపాలా శాఖ వ్యవస్థ వీటి పేరు మీదుగాకోటయ్య కాజా స్టాంపులను విడుదల చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube